Main Menu

బాబు బ‌లం మీద దెబ్బ కొడుతున్నారు..

Spread the love

చంద్ర‌బాబుని చాలామంది వ్య‌తిరేకిస్తున్నా అభిమానులు చ‌లించ‌రు. ఆయ‌న పాల‌నాతీరు మీద పెద‌వి విరిచే వారు ఉన్న‌ప్ప‌టికీ అనుచ‌రులు మాత్రం ఆయ‌న అనుభ‌వాన్ని గుర్తు చేస్తుంటారు. అంతేగాకుండా స‌మ‌ర్థుడైన అడ్మినిస్ట్రేట‌ర్ అంటూ కొనియాడుతుంటారు. మీడియాలో కూడా దానికి త‌గ్గ‌ట్టుగా సాగిన ప్ర‌చారంతో సామాన్యులు కూడా దానిని విశ్వ‌సిస్తూ ఉంటారు. నేటికీ చంద్ర‌బాబు మంచి అడ్మినిస్ట్రేట‌ర్ అనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు.

అయితే గ‌తంలో 9ఏళ్ల‌లో సీఎంగా ప‌నిచేసిన కాలంలో చంద్ర‌బాబు పాల‌న‌తీరు ప్ర‌ధానంగా ఉద్యోగుల‌ని ప‌నిచేయించ‌డంలో స‌క్సెస్ అయ్యార‌న్న‌ది నేటికీ కొంద‌రి అభిప్రాయం. అందుకే ఉద్యోగ‌వ‌ర్గాల వ్య‌తిరేక‌త మూలంగా బాబు ప‌రాజ‌యం పాల‌య్యార‌న్న‌ది టీడీపీ వాద‌న కూడా. దానికి త‌గ్గ‌ట్టుగానే చంద్ర‌బాబు కూడా ప‌లుమార్లు చెప్పుకొచ్చారు. ఇక ప్ర‌స్తుతం నాలుగేళ్ల పాల‌న గ‌మ‌నిస్తే చంద్ర‌బాబు మీద గ‌తంలో స‌దాభిప్రాయం ఉన్న‌వాళ్లు కూడా సందేహించే ప‌రిస్థితి వ‌చ్చేస్తోంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేష‌న్ విష‌యంలో ఆయ‌న ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అనుచ‌రులు కూడా ఆయ‌న పాల‌నాద‌క్ష‌త మీద పెద‌వి విరిచే ప‌రిస్థితి వ‌చ్చేస్తోంది. చంద్ర‌బాబు క‌న్నా చిన‌బాబు జోక్య‌మే అన్నింటా ఉంద‌న్న‌ది చాలామంది చెబుతున్న మాట‌.

ఇక అన్నింటికీ మించి ఇప్పుడు ఐఏఎస్ లు కూడా చంద్ర‌బాబు మాట వినే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. రిటైర్డ్ ఐఏఎస్ లు ప‌లువురు ఇప్ప‌టికే బ‌హిరంగంగా బాబు ని త‌ప్పుబ‌ట్టే ద‌శ‌కు వ‌చ్చేశారు. ఐవైఆర్ వంటి వారు పుస్త‌కం వేసి బండారం బ‌య‌ట‌పెడుతున్నారు. తాజాగా అజ‌య్ క‌ల్లాం కూడా జ‌త‌గ‌లిశారు. ఈఏఎస్ శ‌ర్మ వంటి వారు ఆది నుంచి బాబుకి కంట్లో న‌లుసులా క‌నిపించారు. ఇక ఇదే వ‌రుస‌లో మ‌రింత మంది ఉన్న‌త శ్రేణి అధికార వ‌ర్గం ముందుకు రాబోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. చంద్ర‌బాబు పాల‌నా లోపాల‌ను, అవినీతి వ్య‌వ‌హారాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. ఇది చంద్ర‌బాబు పాల‌నాద‌క్ష‌త మీద కొంద‌రికైనా ఉన్న స‌దాభిప్రాయం చెడ‌గొట్టేలా ఉంద‌న్న‌ది కొంద‌రి ల‌క్ష్యం. దానికి అనుగుణంగానే ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఇలాంటి దాడి జ‌రుగుతోంద‌నే వారు కనిపిస్తున్నారు. త‌ద్వారా చంద్ర‌బాబు బ‌లం మీద దెబ్బ కొట్టాల‌నే కృత‌నిశ్ఛ‌యంతో ఉన్న త‌ర‌గ‌తి వేస్తున్న ఎత్తుల‌తో టీడీపీ త‌ల ప‌ట్టుకుంటోంది. ఇలాంటి ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డంలో టీడీపీ అప్ర‌మ‌త్తంగా లేక‌పోవ‌డంతో అధికార‌వ‌ర్గం నుంచి వ‌స్తున్న దాడితో పెద్ద న‌ష్ట‌మే త‌ప్పేలా లేద‌న్న‌ది ప‌రిశీల‌కుల వాద‌న.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *