బాబూ..మీ మాటలు గానీ..!!

CHANDRABABU
Spread the love

నంద్యాల విజయం తర్వాత చంద్రబాబు వ్యవహారం అసాధారణంగా కనిపిస్తోంది. ఆయనకు హద్దూ పద్దూ ఉన్నట్టుగా కనిపించడం లేదు. తాజాగా ఎల్లో నంద్యాల అని పుస్తకం రాస్తారట. నంద్యాల అభివ్రుద్ధిని అందరికీ చూపిస్తారట. అందరూ చూసి తరలించాలట. నంద్యాల మాదిరిగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను తీర్చిదిద్దురాట. అంతవరకూ బాగానే ఉంది. చంద్రబాబు మాటలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ మాటలతో ఆకట్టుకోవడం అందరికీ సులువే గానీ చేతల్లో చూపించడమే చాలా కష్టం. అందుకే చంద్రబాబుకి ఈ ప్రయత్నం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. నంద్యాల మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో అభివ్రుద్ధి చేస్తామని చెబుతున్న మాటలు నమ్మశక్యమేనా అనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా నంద్యాల మోడల్ లో అభివ్రుద్ధి చేస్తామని, సెప్టెంబర్ 1న నేతలంతా నంద్యాల వెళ్లి అదే రీతిలో అందరికీ అభివ్రుద్ధి గురించి చెప్పాలని ఆయన సెలవిచ్చారు. కానీ అసలు విషయం ఏమంటే నంద్యాలలో ఉప ఎన్నిక గట్టెక్కడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం అసాధారణం. పార్టీ పేరుతో చేసిన వ్యయం పక్కన పెడితే అధికారికంగా ప్రభుత్వం నిధుల వరద నంద్యాల కుందూ నదిని మించి పొంగింది. అదే ప్రజల విశ్వాసం చూరగొనడానికి కారణం అయ్యింది. రాబోయే ఏడాదిన్నరలో అభివ్రుద్ధి జరగాలంటే చంద్రబాబుకే ఓటేయాలని జనం విశ్వసించడానికి దారితీసింది. ఒకవేళ టీడీపీకి ఓటేయకపోతే అభివ్రుద్ది ఆగిపోతుందనే ఆందోళన కూడా ఓట్ల వెల్లువకు తోడ్పడింది.

కానీ అదే రీతిలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయాలంటే చంద్రబాబు 175 నియోజకవర్గాలకు 1500 కోట్ల చొప్పున 2,62,500 కోట్ల రూపాయలు కావాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇంకా కేవలం ఒక బడ్జెట్ మాత్రమే ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఎన్నికల ముందు వచ్చేది ఓట్ ఆన్ బడ్జెట్ మాత్రమే. దాంతో మొత్తం ఏపీ బడ్జెట్ అంతా కలుపుకున్నా 1.5లక్షల కోట్లకు మించదు. అందులో ప్రణాళికా వ్యయం తీసివేయగా మిగిలింది 50వేల కోట్లు కూడా ఉండదు. అందులో మళ్లీ అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు పోగా మిగిలేది అంతంత మాత్రమే. ఇక రెండేళ్లకు చూసుకున్నా బాబుకి లక్ష కోట్లు కూడా అభివ్రుద్ధికి నిధులుండవు. అలాంటిది నంద్యాల మాదిరిగా రెండున్నర లక్షల కోట్లు కేటాయిస్తానని చెప్పడం విశేషమే. విస్మయకరమే. అందుకే బాబు మాటలకు ఆచరణకు అంత పొంతన ఉండదని మరోసారి రుజువయ్యింది.


Related News

bjp congress

బీజేపీకి మరో దెబ్బ

Spread the loveగుజరాత్ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న బీజేపీకి మరో సమస్య ముందుకొచ్చింది అది కూడా ఇప్పటికే సామాజికరంగంలోRead More

jagan11509963809

జగన్ యాత్రలో కొత్త మలుపు…!

Spread the loveఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు పాదయాత్ర చేయడం ఆనవాయితీగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే దానిని చంద్రబాబుRead More

 • మరో రాజకీయ పార్టీ ఆలోచనలో ముద్రగడ
 • జగన్ లో ఎందుకీ మార్పు..?
 • చంద్రబాబు సామర్థ్యం మరచిపోయిన సమాజం..
 • చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్న జగన్
 • బాబు ఎత్తులు జగన్ పై ఎత్తులు
 • జగన్ అక్కడ గురిపెట్టాడు..
 • జగన్ తప్పు చేసినట్టేనా?
 • నియోజకవర్గాల పెంపు: నయా డ్రామా..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *