Main Menu

చంద్ర‌బాబు కేసులు- స్టేలు- చ‌ద‌వండి చ‌రిత్ర‌..!

Spread the love

ఏపీ సీఎం నిప్పులాంటి వారు. అందుకే ఆయ‌న‌కు నీళ్లంటే భ‌యం. కోర్టుల్లో విచార‌ణ జ‌రిగితే ఆ నిప్పు ఎక్క‌డ ఆరిపోతుందోన‌న్న భ‌యం ఆయ‌న‌కు ఉన్న‌ట్టుంది. అందుకే బాబుకి మొద‌టి నుంచి ఒక అలవాటు న‌డుస్తోంది. ఎవ‌రైనా ఆయ‌న మీద ఆరోప‌ణ‌లు చేస్తే..ఆధారాలు చూపిస్తే ..చివ‌ర‌కు కోర్టుకెళ్లి నిరూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఆయ‌న మాత్రం అడ్డ‌దారిలో వెళ‌తారు. అలాంటి కేసుల‌ను నీరుగార్చాల‌ని చూస్తారు. అందుకోసం స్టే ఆర్డ‌ర్లు వెదుకుతారు. త‌న‌కు ఇబ్బందులున్నాయ‌ని తెలిస్తే విచార‌ణ ముందుకు సాగ‌కుండా అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇప్పుడు తాజాగా ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచార‌ణ అడ్డుకోవాలంటూ ఆయ‌న హైకోర్ట్ లో స్టే కోసం వెళ్లిన నేప‌థ్యంలో ఆయ‌న కేసుల చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే ఇదే విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతుంది.

ఏపీని దేశంలోనే ముందు పీఠిన నిలుపుతాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఇప్ప‌టికే అంద‌రిక‌న్నా ముందున్నారు. దేశంలోనే అత్య‌ధిక కేసుల్లో స్టే తెచ్చుకున్న నాయ‌కుడిగా క‌నిపిస్తున్నారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఆయ‌న మీద ప‌దికి పైగా కేసుల్లో స్టే న‌డుస్తోంది. అనేక మంది ఆధారాల‌తో న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తే ఆయ‌న మాత్రం స్టే ఆర్డ‌ర్ ద్వారా వాటి ఎంక్వైరీల‌ను అడ్డుకుంటున్న‌ట్టు ఇట్టే అర్థ‌మ‌వుతోంది. ఇక వాటి చ‌రిత్ర ఓమారు ప‌రిశీలించండి..

కేసు 1

చంద్ర‌బాబు అవినీతిపై ఆయ‌న అత్త‌గారు నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి కోర్టుకెళ్లారు. ఆధారాల‌తో కోర్టులో కేసు వేశారు. విచార‌ణ త‌ర్వాత కేసులో స‌రైనా ఆధారాలు చూపించ‌లేక‌పోతే కోర్ట్ ఆ కేసును కొట్టి వేస్తుంది. ఇప్ప‌టికే అనేక‌మంది మీద అలా కేసులు కొట్టివేసిన చ‌రిత్ర ఉంది. కానీ చంద్ర‌బాబు దానికి భిన్నం. 2005 సెప్టెంబ‌ర్ నాడు ల‌క్ష్మీపార్వ‌తి కోర్ట్ ను ఆశ్ర‌యిస్తే ఆ కేసులో ఇప్ప‌టికీ స్టే ఆర్డ‌ర్ న‌డుస్తుండ‌డం విశేషం.

14212581_10210518797236532_6180992256774639911_n

కేసు 2
మార్చి 17 నాడు అదే సంవత్స‌రంలో చంద్ర‌బాబు అవినీతి వ్య‌వ‌హారాల‌పై మ‌రో కేసు వేశారు. అది కూడా పెండింగ్ లోనే ఉంది.

కేసు 3

ఆపద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఉండి క్యాబినెట్ తీర్మానం కూడా లేకుండా ఐఎంజీకి భూములు కేటాయించిన వ్య‌వ‌హారంపై కూడా కోర్టులో కేసు న‌డుస్తోంది. దానిపై కూడా కోర్టులో పెండింగ్ ఉంది.

కేసు 4

ఏలేరు కుంభ‌కోణం పై అప్ప‌ట్లో విప‌క్ష నేత‌గా ఉన్న పి. జ‌నార్థ‌న్ రెడ్డి పెద్ద పోరాటం చేశారు. ఒక‌రి పొలాన్ని..వేరొక‌రు అమ్మేసుకుంటే..మ‌రొక‌రికి డ‌బ్బులిచ్చిన వ్య‌వ‌హారం ఆధారాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డంతో ఏకంగా జిల్లా కోర్ట్, హైకోర్ట్, హైకోర్ట్ బెంచ్, చివ‌ర‌కు సుప్రీంకోర్ట్ వ‌ర‌కూ వెళ్లి చంద్ర‌బాబు స్టే తెచ్చుకున్నారు.

ఇదే కేసులో జ‌స్టిస్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ వెలువ‌రించిన తీర్పు కూడా స్టే లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

కేసు 5

మ‌ద్యం ముడుపుల కేసులోనూ అదే తంతు. ప‌దేళ్లు దాటిపోయినా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌కుండా స్టే ఆర్డ‌ర్ల‌తో అడ్డుకున్నారు.

కేసు 6 …

చంద్ర‌బాబు అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత తెలంగాణా రాష్ట్రానికి చెందిన పాల్వాయి గోవ‌ర్థ‌న్ రెడ్డి కోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం ఆ కేసులో కూడా స్టే ఉండ‌డం విశేషం.

కేసు 7 …

హెరిటేజ్ ఫుడ్స్ కేసు. గ‌తంలో సీఎంగా ఉండి ఆయ‌న సొంత‌కంపెనీకి ప్ర‌యోజ‌నాలు క‌ట్ట‌బెట్టిన వ్య‌వ‌హారంపై కేసు న‌డుస్తోంది. సేల్ ట్యాక్స్ రూపంలో 14 కోట్ల‌కు పైగా రాయితీలు, సబ్సిడీల పేరుతో మ‌రో 76 ల‌క్ష‌లు క‌ట్ట‌బెట్ట‌డంపై కోర్టులో కేసు వేశారు.

కేసు 8

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా హెరిటేజ్ వాటాల విష‌యంపై కోర్టుకెళ్లారు.

ఇక చంద్ర‌బాబు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పేర్కొన్న‌ట్టు ఆయ‌న‌పై మూడు కేసులున్నాయి. ఇత‌ర కేసుల్లో కూడా చంద్ర‌బాబు వ్య‌వ‌హారం క‌నీసం విచార‌ణ‌ను ఎద‌ర్కోక‌పోవ‌డం విశేషం. ఇప్పుడు ఓటుకు నోటులో కూడా ఆయ‌న‌పై పున‌ర్విచార‌ణ జ‌ర‌పాల‌ని కోర్ట్ చెప్ప‌డం..ఆ వెంట‌నే బాబుని నిందితుల జాబితాలో చేర్చ‌డానికి సిద్ధ‌ప‌డ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న హైకోర్ట్ లో స్వాష్ పిటీష‌న్ ద్వారా విచార‌ణ నిలుపుద‌ల కోర‌డం గ‌మ‌నిస్తే ఆయ‌న నైజం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఆయ‌న నిప్పు పాఠం ఎన్ని మార్లు చెప్పిన‌ప్ప‌టికీ నిజాలు వేరుగా ఉన్నాయ‌న‌డం మాత్రం అంగీక‌రించాల్సిందే.


Related News

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the love8Sharesఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది.Read More

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the love8Sharesతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *