బాబుకి బూమరాంగ్ అయ్యింది…!

cbn tdp polit
Spread the love

తెలుగుదేశం అధినేత ఆశలు పండడం లేదు. పైగా ఎన్నిరకాల ఎత్తులేసిన చిత్తవుతున్నాయి. అంతకుమించి బూమరాంగ్ అవుతున్నాయి. దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి టీడీపీది. చివరకు ఎంతో హడావిడి చేసి, తాడోపేడో అని మీడియాకు లీకులిచ్చి ఆఖరిలో ఫోన్ కాల్ తో మెత్తబడక తప్పని పరిస్థితి వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచింది. రాజకీయ పరిశీలకులకు పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా బాబు తీరు మరీ ఇంతగా పతనమవుతున్న పరిస్థితి విశేషంగా చెబుతున్నారు.

తెలుగుదేశం , బీజేపీ సంబంధాలకు చాలాకాలంగా సమస్యలు వస్తున్నాయి. దానికి బడ్జెట్ ఆజ్యం పోసింది. ఇక రాంరాం చెప్పక తప్పదనే వాదన బయలుదేరింది. చంద్రబాబు కూడా అలాంటి సంకేతాలు ఇచ్చారు. కొందరు ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారు. మంత్రులు దూరం కావాలని సూచనలు వచ్చాయి. అన్నింటినీ కలిపి ఓ కొలిక్కి తీసుకురావడంలో భాగంగా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడ కూడా రకరకాల ప్రతిపానదలు వచ్చాయి. చివరకు చంద్రబాబు కూడా ఎన్ని బడ్జెట్ లు చూసినా ఏమున్నది ప్రయోజనం అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. దాంతో గట్టి దెబ్బ తప్పదనే వాదన ముందుకొచ్చింది.

ఈలోగా మీడియాలో కూడా చంద్రబాబు పలువురు నేతలతో చర్చిస్తున్నారని, శివసేన సహా అనేక మంది టచ్ లోకి వచ్చారని వార్తలు అల్లేశాయి. దాంతో వ్యవహారం మరింత వేడిని రాజేసింది. అంతా కలిసి మరోసారి చక్రం తిప్పే ఛాన్స్ చంద్రబాబుకేనని భావించారు. ఈలోగా సమావేశం చివరిలో రాజ్ నాథ్ సింగ్ నుంచి ఫోన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఉదయం నుంచే అమిత్ షా ఫోన్ చేశారని మీడియాలో హోరెత్తించినా చివరకు ఆయన ఫోన్ చేయలేదని సుజనా చౌదరి స్వయంగా ప్రకటించక తప్పలేదు. ఇక ఆ తర్వాత మోడీగానీ, అమిత్ షా గానీ మాట్లాడతారనుకుంటే ఏకంగా హోం మంత్రితో మాట్లాడిించడడం విశేషంగా మారింది. సీబీఐ, ఈడీ సహా వివిధ శాఖలను సమన్వయం చేసే మంత్రికి ఫోన్ బాధ్యత అప్పగించడం వెనుక అసలు కారణం వేరుగా ఉంటుందని అంటున్నారు. అందుకే త్రిపుర ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ రాజ్ నాధ్ సింగ్ మాట్లాడారని చెబుతున్నారు.

దాంతో మొత్తం వ్యవహారం మారిపోయింది. చంద్రబాబు చల్లబడ్డారు. రాజీనామాల ప్రస్తావనలు వెనక్కిపోయాయి. ఊహాగానాలన్నీ గాలికిపోయాయి. మళ్లీ నిలదీస్తామంటూ చెప్పినప్పటికీ అలాంటి సీన్ ఉండదనే అభిప్రాయం బలపడింది. అంతేగాకుండా టీడీపీ పార్లమెంటరీ సమావేశానికి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, సీఎం రమేష్ ఢుమ్మా కొట్టడం మరో ఆసక్తికర అంశం.


Related News

tdp mps meeting

టీడీపీలో రాజ్య‌స‌భ లొల్లి…

Spread the loveఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో వ‌చ్చే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం మూడు సీట్లు ఖాళీRead More

bjp

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

Spread the loveఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లుRead More

 • జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు..
 • గేరు మార్చిన జగన్
 • మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?
 • పవన్ పథకం పారుతుందా..
 • మోడీ ముందు మోకరిల్లిన తెలుగు ఎంపీలు
 • జగన్ ఇరుక్కుంటున్నట్టే
 • బాబుకి బూమరాంగ్ అయ్యింది…!
 • బాబు వద్దంటుంటే..జగన్ కావాలంటున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *