Main Menu

ఈ కేసులో బాబు ఇరుక్కున్న‌ట్టేనా..!?

Spread the love

ఏపీ సీఎం హోదాలో చంద్ర‌బాబు మీద తొలిసారిగా ఓ ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం న‌మోద‌య్యింది. న‌వ్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత నేరుగా చంద్ర‌బాబు అవినీతి వ్య‌వ‌హారాల మీద ఇదే తొలి పిల్ కావ‌డం విశేషం. అంత‌కుముందు తెలంగాణాలో ఓటుకు నోటు కేసు క‌ల‌క‌లం రేపిన‌ప్ప‌టికీ అది స్టింగ్ ఆప‌రేష‌న్ లో ప‌ట్టుబ‌డిన త‌ర్వాత‌ న‌మోదు చేసిన కేసు కావ‌డం విశేషం. ఇక ఇప్పుడు పిల్ వేసింది కూడా ఓ రాజీనామా చేసిన న్యాయ‌మూర్తి కావ‌డం మ‌రో విశేషం. దాంతో ఉద్యోగం వ‌దులుకున్న యువ న్యాయ‌మూర్తి నేరుగా రాజ‌కీయ ఆరంగేట్రం చేసి, సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న త‌ర్వాత ఏకంగా సీఎం మీద గురిపెట్ట‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకి తోడుగా నారా లోకేష్, మాజీ ఐటీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డితో పాటుగా వేమూరి ర‌వికుమార్ ని కూడా ప్ర‌తివాదులుగా చేర్చ‌డంతో ఈ పిల్ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

అదే స‌మ‌యంలో య‌ధావిధిగా చంద్ర‌బాబు ఈ కేసులో కూడా గ‌ట్టెక్కుతార‌నే వాద‌న ప‌లువురిలో వినిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు కేసుల్లో స్టేల స‌హాయంతో విచార‌ణ ముందుకు సాగ‌కుండా అడ్డుకున్నార‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్న బాబు అదే బాట‌లో కొన‌సాగుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే జే శ్ర‌వ‌ణ్ కుమార్ అనే గుంటూరు జిల్లాకు చెందిన న్యాయ‌వాది స్వ‌యంగా త‌న కేసు తానే వాదించుకోవ‌డ‌మే కాకుండా పూర్తి ఆధారాల‌తో కోర్ట్ ని ఆశ్ర‌యించ‌డంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కోర్టు విచార‌ణ‌కు సిద్ధ‌ప‌డిన వేళ చంద్ర‌బాబుకి, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కి కూడా నోటీసులు అందే ప‌క్షంలో అది మ‌రోసారి రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేప‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు.

ఇప్ప‌టికే చంద్ర‌బాబుకి ధ‌ర్మాబాద్ కోర్ట్ లో రీకాల్ పిటీష‌న్ కూడా తోసిపుచ్చ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. దాంతో అక్టోబ‌ర్ లో కోర్ట్ ముందు హాజ‌రుకావాల్సిన నేప‌థ్యంలో పెద్ద ధ‌ర్మ‌సందేహాన్ని త‌ల‌పిస్తోంది. ఈలోగా ఈ పిల్ మెడకు చుట్టుకుంటే మ‌రో పెద్ద స‌మ‌స్య త‌ప్ప‌ద‌నిపిస్తోంది. ఇప్ప‌టికే బీజేపీ పెద్ద‌ల మీద చంద్ర‌బాబు అండ్ కో విమ‌ర్శ‌లు చేయించారు. కొత్త పార్టీలు పెట్టించి, త‌మ మీద దాడి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. దాంతో ఈ వ్య‌వ‌హారం వెనుక రాజ‌కీయ కోణం ఏముందోన‌నే చ‌ర్చ సాగుతోంది. ఏమ‌యినా తాజా ప‌రిణామాల‌తో ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపులు ఖాయంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ అవినీతిపై, ఆయ‌న్నే బాధ్యుడిగా చేస్తూ దాఖ‌ల‌యిన పిటీష‌న్ కావ‌డంతో ప్ర‌జ‌లంద‌రి దృష్టి హైకోర్ట్ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే దానిపై ప‌డింది. అందులోనూ ఆడంబ‌రంగా చెప్పుకునే ఐటీ రంగంలో 25వేల కోట్ల మేర సాగిన క్విడ్ ప్రోకో వ్య‌వ‌హారానికి సంబంధించిన విష‌యం కావ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీస్తోంది.


Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *