Main Menu

మళ్లీ పాత నినాదం అందుకుంటున్న టీడీపీ

Spread the love

ఆశ్చర్యమే అనిపించినా..తెలుగుదేశం మళ్లీ పాతరోజుల్లోకి వెళుతోంది. ఏపీ హక్కుల కోసం మాట్లాడుతోంది. ఆశ్చర్యంగా తాము చెప్పిన మాటలకు భిన్నంగా స్పందిస్తోంది. ఉదాహరణకు ప్రత్యేక హోదా విషయంలో ఆపార్టీ తీరు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తొలుత ఐదేళ్లు కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవని కాదు అంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు తాను చెప్పిన మాటకు భిన్నంగా ఆయన మాట మార్చేసిన విషయం మరచిపోకముందే మళ్లీ తెలుగుదేశం మాట మార్చేస్తున్నట్టు కనిపిస్తోంది. డబుల్ గేమ్ ఆడుతున్నట్టు కనిపించిన తెలుగుదేశం ఈసారి ట్రిపుల్ గేమ్ కి ప్రయత్నిస్తోంది.

అందుకే కొన్నాళ్ల క్రితం ప్రత్యేక హోదా అంటే రద్దయిన 500 నోటుతో సమానమంటూ వ్యాఖ్యానించిన సుజనా చౌదరి, తాజాగా రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల ప్రకారం రద్దయిన నోటు గురించి ఆయన మళ్లీ ప్రస్తావించారు. స భా సాక్షిగా కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా, ఏపీలో సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మలుచుకునే లక్ష్యంలో టీడీపీ ఉంది. దానికి తగ్గట్టుగానే లోక్ సభలో రైల్వేజోన్ కోసం ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారు. పాలక కూటమిలో భాగస్వామిగా ఉంటూ ప్రైవేటు బిల్లు పెట్టడమే ఆశ్చర్యమే అయినా తెలుగుదేశం ఎంపీ రామ్మెహన్ నాయుడు దానికి సిద్ధపడ్డారు.

అదే క్రమంలో హైకోర్ట్ విభజన గురించి తెలంగాణా ఎంపీలు ప్రస్తావించగానే సుజనా చౌదరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. దాంతో ఇది ఏపీలో తెలుగుదేశం మరోసారి మాట మార్చేస్తోందా అన్న చర్చ సాగుతోంది. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఎవరైనా ఉద్యమిస్తే సహించేది లేదంటూ యువతను, విద్యార్థులను హెచ్చరించిన చంద్రబాబు , ఆయన అనుచరులు ఇఫ్పుడు పార్లమెంట్ లో దాని గురించి మాట్లాడడం ప్యాకేజీ మాటలన్నీ మోసాలుగా చాటుతున్నాయి. దాంోత చంద్రబాబు మరోసారి మాట మారుస్తున్న తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది.






Related News

రాధా ముందు నుయ్యి..వెనుక గొయ్యి..!

Spread the loveవంగ‌వీటి రాధా వ్య‌వ‌హారం ఆసక్తిగా మారుతోంది. వైసీపీలో ఆయ‌న కొన‌సాగుతారా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మూడుRead More

చంద్ర‌బాబు షాకివ్వ‌బోతున్న ఎమ్మెల్యేల జాబితా ఇదే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల విష‌యంలో క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. గ‌తంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *