ఇదే మాట మరొకరు అనుంటే..

995bf342-5ead-4d51-a4d1-da576d890865
Spread the love

ఇలాంటి కామెంట్ ఏ ప్రతిపక్ష నాయకుడి నోటి నుంచి వచ్చినా బీభత్సం జరిగిపోయేది. రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామీ వీరంగం మొదలుకుని..వీధుల్లో భక్తుల విశ్వరూపం వరకూ సోషల్ మీడియా హాట్ హాట్ గా కనిపించేది. కానీ తీరా చూస్తే ఆ కామెంట్ చేసింది మోడీ క్యాబినెట్ లో మంత్రి అయిపోయారు. అందుకే ఇప్పుడు భక్తులు హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. కనీసం స్పందించడానికి కూడా ముందకు రావడం లేదు.

సైనికులను ఏదో అన్నారని ఆధారాల్లేకుండానే చాలామంది నేతల మీద ఇప్పటికే విరుచుకుపడిన భక్తులు ఇప్పుడు ఏకంగా సైన్యంలో చేరండి..మందు తాగడం అని పిలుపునివ్వడం మీద నోరు మెదపకపోవడం గమనిస్తే వారి నైజం ఇట్టే అర్థమవుతుంది. గతంలో జేఎన్యూ వివాదం సందర్భంగా కన్నయ్య మీద ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. ఆయన పదో తరగతి ఫెయిల్ అయినవాళ్లే సైన్యంలో చేరుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు వక్రీకరించి విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కేరళలో ఏదో ఎర్రజెండా పార్టీ నాయకుడి మీద కూడా అదే స్థాయిలో కథనాలు అల్లారు. తాను అలాంటి కామెంట్ చేయలేదని చెప్పినా నానా రచ్చ చేసి పారేశారు. దేశద్రోహులని ముద్రలు కూడా వేశారు.

అలాంటిదిప్పుడు ఏకంగా ఓ మంత్రి నేరుగా ఈరీతిలో సైనికుల మందు గురించి ప్రస్తావించినా నోరు తెరవలేకపోవడం గమనిస్తే వారి అసలు భక్తి రాజకీయాల మీదే తప్ప సైనికుల మీద కాదని అనుమానించాల్సి వస్తోంది. మతం పేరుతో రాజకీయాలు..ఆవు పేరుతో రాజకీయాలతో సరిపెట్టుకోకుండా చివరకు సైనికులతోనూ రాజకీయాలు సాగించడానికి శతవిధాలా ప్రయత్నించిన వాళ్లు ఇప్పుడు సైనికులను చిన్నబుచ్చేలా మాట్లాడిన వాళ్లను వ్యతిరేకించలేకపోవడం, ఇంకా చెప్పాలంటే ఇలాంటి మంత్రులందరికీ నాయకుడిగా ఉన్న మోడీని ఆరాధించడం గమనార్హం.


Related News

DMjD9f8VQAATMr7

అయినా..బాబు మారలేదు

Spread the loveమనిషి మారలేదు..అతని తనివి తీరలేదు అంటూ సినిమా దర్శకుడు రాసిన పాటను ఇక్కడ గుర్తు చేసుకుంటే చంద్రబాబుRead More

chandrababu-ravanth-reddy-647x450

బాబు ఖాతాలో మరో వికెట్ అంతే…!

Spread the loveతెలంగాణా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత గూటిని వదిలి కాంగ్రెస్ పంచన చేరుతుండడం సంచలనంRead More

 • కేసీఆర్ వ్యూహం..బాబు జాతీయ హోదా గల్లంతు
 • వైసీపీ వ్యూహానికి బుట్టా బలి..
 • చంద్రబాబుకి ఓ ఇంటాయన లేఖ
 • మోడీకి మరో షాక్, దేశద్రోహులకు గ్రీన్ సిగ్నల్
 • కేసీఆర్ తో కేశవ్: కలచివేత ఎవరికి?
 • అమిత్ షా అవినీతికి ఆధారాలివిగో…
 • పవన్ కల్యాణ్ పొజిషన్ ఏంటి?
 • ఇదే మాట మరొకరు అనుంటే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *