Main Menu

చంద్ర‌బాబుకి సీబీఐ తొలిషాక్

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి తొలి షాక్ త‌ప్పేలా లేదు. సీబీఐకి ఏపీలో అనుమ‌తి నిరాక‌రించిన చంద్ర‌బాబుకి అయేషా మీరా రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌ప్పేలా లేదు. ఏపీ ప్ర‌భుత్వం సీబీఐకి సాధార‌ణ అనుమ‌తులు నిరాక‌రించిన‌ప్ప‌టికీ కోర్ట్ ఆదేశాల‌తో సీబీఐ రంగంలో దిగే ప‌రిస్థితి రావ‌డంతో చంద్ర‌బాబు స‌ర్కారుకి ఏం చేయాల‌న్న‌ది పాలుపోయే అవ‌కాశం లేదు.

వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు వివిధ కేసుల్లో సీబీఐకి అనుమ‌తి నిరాక‌రించిన‌ప్ప‌టికీ కోర్ట్ ఆదేశాల‌తో సీబీఐ ఎప్పుడైనా రంగంలో దిగే అవ‌కాశం ఉంటుంది. అందుకు ఇప్పుడు ఏపీలో తొలి అడుగు పడుతోంది. సుదీర్ఘ‌కాలంగా పెండింగ్ లో ఉన్న అయేషా మీరా హ‌త్య కేసులో సీబీఐ రంగంలో దిగేందుకు ఉమ్మ‌డి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

వెంట‌నే కేసు సీబీఐకి బ‌ద‌లాయించాల‌ని ఆదేశాలు రావ‌డంతో ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు కోసం రంగంలో దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. దాంతో ప‌దేళ్ల క్రితం నాటి కేసులో ఏపీలో సీబీఐ ఎంట్రీ ఖాయం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇత‌ర కేసుల్లో కూడా సీబీఐ కిఇలాంటి ఆదేశాలు వ‌స్తే రంగంలో దిగే ఛాన్స్ లేక‌పోలేద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది.






Related News

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the loveతెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్Read More

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *