చంద్రబాబుకి శిక్ష తప్పదా..?

chanadra
Spread the love

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వ్యవహారం ఈ కాలంలో ఆసక్తిగా మారింది. ముఖ్యంగా రిలయెన్స్ సంస్థ ముఖేష్ అంబానీ అమరావతి వచ్చి బాబుతో భేటీ అయిన తర్వాత అనూహ్య మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వంపై ఆయన ఘాటుగా స్పందిస్తున్నారు. నేరుగా మోడీ మీద విమర్శలు చేస్తున్నారు. ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు కూడా దిగుతున్నారు. బహిరంగసభలు పెట్టి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ మంత్రులు, ఇతర అనుకూల సంఘాల నేతలు ప్రచారానికి పూనుకున్నారు. బీజేపీని ఓడించాలనే ప్రచారం సాగిస్తున్నారు.

దాంతో వ్యవహారం కమలనాధులకు కంటగింపుగా మారింది. బాబుకి బ్రేకులు వేయాలనే ఆలోచనకు వచ్చారనే ప్రచారం సాగుతోంది. కర్ణాటక ఫలితాల తర్వాత చంద్రబాబు మీద చర్యలుంటాయనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు వ్యాఖ్యలున్నాయి. ఎదురుతిరిగితే కేసులు పెడతారా అంటూ ఆయన నిలదీశారు. తాను వెనకాడడని చెప్పుకొచ్చారు. తనకు ప్రజలు రక్షణకవచంలా నిలవాలని కోరారు. తనమీద దాడి జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు. దాంతో ఆయన వ్యాఖ్యల సారాంశాన్ని బట్టి చంద్రబాబుకి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో వ్యవహారం సాగుతోందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో కూడా కనిపిస్తోంది.

దానికి తగ్గట్టుగానే తాజా చర్యలున్నాయి. ముఖ్యంగా ఓటుకు నోటు వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. బీజేపీ నేతలు పదే పదే పట్టిసీమ పై కాగ్ నివేదికను ప్రస్తావించారు. ఇతర అవినీతి వ్యవహారాలను ప్రస్తావించారు. ఇలా చంద్రబాబు వ్యవహారాలకు సంబంధించిన చర్చ సాగుతున్న తరుణంలోనే చంద్రబాబు వాయిస్ ని నిర్ధారిస్తూ మూడేళ్ల క్రితం నాటి కేసు తిరగతోడే ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా మారింది. ముఖ్యంగా అమరావతిలో వివిధ రాష్ట్రాల మంత్రులతో కలిసి కేంద్రం తీరు మీద చంద్రబాబు దుమ్మెత్తిపోస్తున్న సమయంలోనే ఓటుకునోటు ప్రస్తావన రావడం వెనుక పెద్ద కారణాలే ఉంటాయనే అనుమానం బలపడుతోంది. చంద్రబాబు కి తగిన రీతిలో బుద్ధిచెప్పాలని మోడీ ఆలోచిస్తున్నారనే ప్రచారానికి ఊతమిస్తోంది.

దాంతో చంద్రబాబు వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో కదలిక చంద్రబాబుకి పెద్ద స్థాయిలో బ్రేకులు వేసే అవకాశం ఉంది. అయినా ఆయన దూకుడు కొనసాగిస్తే మాత్రం కేంద్రం మరిన్ని ఎత్తులు వేసే అవకాశం ఉంది. దాంతో ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారతాయనడంలో సందేహం లేదు.


Related News

chandrababu naidu - PTI_1

తెగే వరకూ లాగితే చిరిగిపోతుంది బాబూ..!

Spread the loveకొన్ని వ్యవహారాలు అంతే. కక్కాలేక మింగాలేకా అన్నట్టుగా ఉంటాయి. తాజాగా టీటీడీ వివాదం కూడా అంతే. చంద్రబాబుRead More

tdp-bjp-fg647x450

బీజేపీకి ఒక నీతి, టీడీపీ, వైసీపీ మరో రీతి..

Spread the loveకర్ణాటకలో ఆశ్చర్యకర పరిణామాల నుంచి ఇంకా చాలామంది పూర్తిగా కోలుకోలేదు. అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం మూణ్ణాళ్లకే మూటRead More

 • బీజేపీ చారిత్రక తప్పిదం…!
 • చంద్రబాబు వెనకడుగు
 • బాబుకి మంట పెడుతున్న బీజేపీ
 • చంద్రబాబుకి శిక్ష తప్పదా..?
 • అవకాశాలు చేజార్చుకుంటున్న జగన్
 • అయోమయమా..అవగాహనా లోపమా?
 • చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?
 • ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *