బాబుకి మంట పెడుతున్న బీజేపీ

shah cbn
Spread the love

బీజేపీ సిద్ధమవుతోంది. చంద్రబాబుకి సెగ తప్పేలా లేదు. సమస్యల్లో ఉన్న చంద్రబాబుని మరింత ఇరకాటంలోకి నెట్టడమే లక్ష్యంగా బీజేపీ సాగుతోంది. తిరుపతి పర్యటనలో జరిగిన పరిణామాలు, అంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ తీరు అన్నీ కలిసి కమలనాధులకు హస్తినలో మరింత ఆగ్రహం కలిగించినట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఓటుకు నోటు కేసు మరో సారి తెరమీదకు వచ్చింది. తాజాగా చంద్రబాబు బద్ధ వ్యతిరేకులను ఏరికోరి పట్టం కట్టడం ద్వారా రాబోయే రోజుల్లో ఏపీ సీఎం మీద తీవ్ర స్థాయిలో ఎదురుదాడి సాగబోతున్నట్టు బీజేపీ సంకేతాలు పంపిస్తోంది.

ఇఫ్పటికే చంద్రబాబు తన మీద కేసులు పెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా తనకు అండగా ఉండాలని, ఏకంగా రక్షణ కవచం కావాలని కూడా బహిరంగంగా విజ్ణప్తి చేశారు. దానికి తగ్గట్టుగానే బీజేపీ అధిష్టానం ముందుకు సాగుతోంది. చంద్రబాబు చుట్టూ పెద్ద అఘాతం స్రుష్టించే యత్నం చేస్తోంది. కన్నా లక్ష్మీనారాయణని ఏరికోరి బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించడం వెనుక బీజేపీ పెద్దల వ్యూహం అందులో భాగమేనని స్పస్టం అవుతోంది. కన్నా లక్ష్మీనారాయణతో సుదీర్ఘకాలంగా చంద్రబాబుకి తీవ్ర వైరుధ్యం ఉంది. కన్నాని కట్టడి చేయడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించారని గుంటూరు రాజకీయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా ప్రస్తుతం అలాంటి కన్నాకి కిరీటం కట్టబెట్టడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అర్థమవుతోంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు తప్పేలా కనిపించడం లేదు. ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు. ఏం జరిగినా అది ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనం అవుతుందనడంలో సందేహం లేదు.


Related News

chandrababu naidu - PTI_1

తెగే వరకూ లాగితే చిరిగిపోతుంది బాబూ..!

Spread the loveకొన్ని వ్యవహారాలు అంతే. కక్కాలేక మింగాలేకా అన్నట్టుగా ఉంటాయి. తాజాగా టీటీడీ వివాదం కూడా అంతే. చంద్రబాబుRead More

tdp-bjp-fg647x450

బీజేపీకి ఒక నీతి, టీడీపీ, వైసీపీ మరో రీతి..

Spread the love5Sharesకర్ణాటకలో ఆశ్చర్యకర పరిణామాల నుంచి ఇంకా చాలామంది పూర్తిగా కోలుకోలేదు. అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం మూణ్ణాళ్లకే మూటRead More

 • బీజేపీ చారిత్రక తప్పిదం…!
 • చంద్రబాబు వెనకడుగు
 • బాబుకి మంట పెడుతున్న బీజేపీ
 • చంద్రబాబుకి శిక్ష తప్పదా..?
 • అవకాశాలు చేజార్చుకుంటున్న జగన్
 • అయోమయమా..అవగాహనా లోపమా?
 • చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?
 • ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *