Main Menu

బాబుకి బ్రేకప్ చెప్పాలనే తపనలో బీజేపీ

somu veerraju
Spread the love

ఏపీ బీజేపీ నేతలు దూకుడు పెంచారు. తెలుగుదేశం అధినేతకు తలనొప్పిగా మారుతున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాల తర్వాత దూకుడు పెంచిన సోము వీర్రాజు వంటి వారి తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా సొంతంగా పోటీ చేసి సత్తా చాటుతామంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. దానికి తగ్గట్టుగానే సోము వీర్రాజు మీద బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇరు పార్టీల మధ్య ఇప్పుడు మరోసారి మాటల యుద్ధానికి తెరలేచింది.

ఏపీ బీజేపీ నేతలను గతంలో అమిత్ షా నియంత్రించడంంతో కొంత వెనక్కి తగ్గారు. కానీ తాజాగా చంద్రబాబు అవినీతిని, ఫిరాయింపు రాజకీయాలను, అన్నింటినీ సోము వీర్రాజు చెలరేగిపోవడంతో స్వేచ్ఛ లభించినట్టుగా కనిపిస్తోందనే అంచనాలున్నాయి. అదే జరిగితే టీడీపీ, బీజేపీ మధ్య బంధం మరింత సన్నబడడం ఖాయం. ఇప్పటికే పోలవరం విషయంలో బాబుని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. రాజధాని విషయంలోనూ గట్టిగా పట్టుదలతో కనిపిస్తున్నారు. అనేక అంశాలలో అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ డీజీపీ నియామకంలో దాదాపుగా బాబు ప్రతిపాదనలన్నీ వెనక్కి పంపేశారు. మొత్తంగా కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాధాన్యం మాత్రం టీడీపీకి దక్కడం లేదు.

ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య సంబంధాల గురించి మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీని వదలకుండా రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలు లేవని తేల్చేయడంతో కేంద్రం పెద్దలు కూడా పునరాలోచన చేయడం ఖాయం అవుతోంది. అదే జరిగితే బ్రేకప్ కి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. అదే సమయంలో కొత్త పరిణామాలకు అది నాంది కూడా కావచ్చు.






Related News

cbn

కోరి క‌ష్టాలు కొనితెచ్చుకోవ‌ద్దు బాబూ..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అనూహ్యంగా స్పందిస్తున్నారు. ఓ వైపు ఆయ‌న్ని వీరుడూ, శూరుడూ అంటూ ఓ వ‌ర్గం మీడియాRead More

ysrcp-party-flag-647x450

వైసీపీ సిట్టింగుల‌లో గెలిచేదెవ‌రు?

Spread the loveఎన్నిక‌ల వాతావ‌ర‌ణం స‌మీపిస్తోంది. మ‌రోసారి ముంద‌స్తు చ‌ర్చ మొద‌లుకావ‌డంతో అంద‌రి దృష్టి నియోజ‌క‌వ‌ర్గాల మీద ప‌డుతోంది. తాజాగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *