Main Menu

ఏపీ ఎంపీల ర్యాంక్స్ లో ఆశ్చ‌ర్య‌క‌ర ఫ‌లితాలు..!

Spread the love

ప‌ద‌హార‌వ లోక్ స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించిన స‌భ్యుల ప‌నితీరుకి సంబంధించిన ర్యాంకింగ్స్ లో ఆస‌క్తిక‌ర అంశాలు వెలువ‌డ్డాయి. అంద‌రి క‌న్నా అర‌కు ఎంపీ అగ్ర‌స్థానంలో నిల‌వ‌డం విశేషంగా మారింది. జాతీయ స్థాయిలో 40వ ర్యాంకులో నిలిచిన కొత్తప‌ల్లి గీత తెలుగు రాష్ట్రాల ఎంపీల‌లో తొలిస్థానం ద‌క్కించుకున్నారు. స‌భ‌లో ప‌నితీరు. వివిధ అంశాల‌పై చ‌ర్చ‌ల్లో భాగ‌స్వామ్యం కావ‌డం, హాజ‌రు, ప్ర‌శ్న‌లు వేయ‌డం, నిధుల వినియోగం వంటి ప‌లు ప్రాతిప‌దిక‌ల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణ‌యించారు.

ఆమె త‌ర్వాత ఏపీకి చెందిన ఎంపీల‌లో మ‌రో యువ‌ఎంపీ శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిలిచారు. ఓవ‌రాల్ గా 80వ స్థానంలోనూ ఏపీ ఎంపీల‌లో రెండో స్థానంలోనూ ఆ యువ ఎంపీ నిలిచారు. ఈ లిస్టులో మూడో స్థానం విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబుకి, నాలుగో స్థానం అమ‌లాపురం ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబుకి ద‌క్కింది. వీరిద్ద‌రూ కూడా తొలిసారి పార్ల‌మెంట్ కి ప్రాతినిధ్యం వ‌హించిన వారే కావ‌డం విశేషం.

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు (విజ‌య‌న‌గ‌రం ఎంపీ) కి ఏపీ త‌రుపున ఐదో స్థానం ద‌క్క‌గా జాతీయ స్థాయిఓల 152 వ స్థానంలో నిలిచారు. 153వ స్థానంలో నిలిచి ఏపీ త‌రుపున ఆరో స్థానం గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ (161వ స్థానం), బాప‌ట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి (190 వ స్థానం), కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహం(206వ స్థానం) దక్కించుకున్నారు.

ఆ త‌ర్వాత వ‌రుస‌గా నిమ్మ‌ల క్రిష్ట‌ప్ప‌, కేశినేని నాని, మాగంటి బాబు, గోక‌రాజు గంగ‌రాజు, బుట్టా రేణుక‌, కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, నార‌మ‌ల్లి శివ‌ప్ర‌సాద్, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, జేసీ దివాక‌ర్ రెడ్డి నిల‌వ‌గా దేశ‌వ్యాప్తంగా 417వ స్థానంలోనూ ఏపీ త‌రుపున ఆఖ‌రి స్థానంలో ఎస్పీవై రెడ్డి ఉన్నారు. అయితే ఈ జాబితాలో వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు ఆమోదించ‌డంతో వారు పూర్తికాలం అధికారంలో లేని కార‌ణంగా చోటు ద‌క్క‌లేదు. వైసీపీ ఎంపీల‌లో మిధున్ రెడ్డి , మేక‌పాటి వంటి వారు కూడా ప‌లు చ‌ర్చ‌ల‌లో చురుగ్గా పాల్గొన్న‌ప్ప‌టికీ వారికి ర్యాంకింగ్స్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the love8Sharesతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the love294Sharesవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *