Main Menu

అమిత్ షా అవినీతికి ఆధారాలివిగో…

Spread the love

అమిత్ షా…బీజేపీ జాతీయ అధ్యక్షుడు..ఆయన ఆస్తుల గురించి తెలిస్తే అవాక్కవుతారు. మీరే కాదు…ఎవరు విన్నా సరే అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. దానికి కారణం లేకపోలేదు. ఆయన తనయుడి పేరుతో పెరిగిన ఆస్తుల ఆ స్థాయిలో ఉన్నాయి. సబ్ కా వికాస్ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలనలో అంబానీ, అదానీ తెగబలుస్తుండా సామాన్యుడు నోట్లరద్దు, జీఎస్టీల దెబ్బతో తల్లడిల్లుతున్న విషయం తాజా అధికారిక లెక్కలు చాటుతున్నాయి. కానీ ఆలయం పేరుతో అధికారం సాధించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి తనయుడు టెంపుల్ పేరుతో కంపెనీ పెట్టి ఏ రీతిన వ్యవహరించాడో తాజాగా వెల్లడయ్యింది. ది వైర్ వెల్లడించిన వివరాల ప్రకారం అమిత్ షా తనయుడి రూపంలో సాగిన కుంభకోణం బయటపడింది.

అమిత్ షా తనయుడు జే అమిత్ భాయ్ షా ఆస్తులు గడిచిన కొంత కాలంలోనే 16వేల శాతం పెరిగినట్టు కనిపిస్తోంది. ఆయన తండ్రి పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇటీవల రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ముందు దాఖలు పరిచిన సర్టిఫికెట్ లో పేర్కొన్న లెక్కలు గమనిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా ఉంది. కంపెనీలో బ్యాలెన్స్ షీట్ లో మార్చి 2014 తో పోల్చి చూస్తే ఇది కనిపిస్తుంది. 2013,14లో వరుసగా రెండేళ్ల పాటు 6,230, 1724 రూ. ల వంతున నష్టాలు చూపించిన జే అమిత్ , 2015 16 సంవత్సరంలో ఏకంగా 80 కోట్ల రూపాయల లాభాలు చూపించాడు. అంతేగాకుండా రిలయెన్స్ సంస్థల ప్రతినిధిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు రాజేష్ ఖండేవాలే నుంచి షరతులు లేకుండా 15.78 కోట్ల అప్పు కూడా తీసుకున్నట్టు బ్యాలెన్స్ షీట్లో పేర్కొన్నారు. అయితే 2016 17 ఆర్థిక సంవత్సరంలో హఠాత్తుగా సదరు కంపెనీ మూతేస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టెంపుల్ ఎంంటర్ ప్రైజస్ పేరుతో నడిపిన ఆ సంస్థలో అంతకుముందు సంవత్సరాల్లో వచ్చిన నష్టాలను చూపించి అక్టోబర్ 2016లో మూతేయడం విశేషం.

గతంలో యూపీఏ హయంలో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి కూడా ఇదే విధంగా డీఎల్ఎప్ నిధులు వచ్చి చేరడం విశేషం. ఇక జే కంపెనీని 2004లోో ప్రారంభించారు. జితేందర్ షా తో కలిసి జై షా స్థాపించిన టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ లో అమిత్ షా భార్య సొనాల్ షా కూడా భాగస్వామిగా ఉన్నారు. ఆ సంస్థ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారమే 2013 వరకూ లాభాలు లేవు. పైగా 5796 రూ. ల ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపులు కూడా రిఫండ్ సాధించింది. కానీ 2014 15కి అంటే మోడీ అధికారంంలోకి వచ్చిన సంతవ్సరం నుంచి లాభాలు మొదలయ్యాయి. అవి ఏకంగా 2015-16లో 80.5 కోట్లకు చేరింది. రిజర్వ్ నిధులు కూడా 19లక్షల నుంచి 80 లక్షలకు చేరింది. అంతకుముందు సంవత్సరం 5,618రూ.లుగా ఉన్న వ్యాపార చెల్లింపులు ఏకంగా 2.65 కోట్లకు చేరాయి. అప్పటి వరకూ కేవలం 2లక్షల విలువ చేసే ఆస్తులున్న సంస్థకు ఏకంగా 4.14 కోట్ల స్వల్పకాల రుణం కూడా దక్కింది. ఇన్వెంట్రీస్ కూడా అప్పటి వరకూ శూన్యం గా ఉన్న స్థాయి నుంచి ఒక్క ఏడాదిలోనే 9 కోట్లు వచ్చి చేరాయి.

అమ్మకాల ద్వారానే లాభాలు గడించినట్టు చూపించిన ఆ సంస్థలో అంతకుముందు విదేశీ వ్యాపారం సున్నా కాగా ఆ ఒక్క సంవత్సరంలోనే 51 కోట్లకు చేరింది. అంతేగాకుండా KIFS ఆర్థిక సంస్థ నుంచి 15.78 కోట్లు రుణం తీసుకున్నట్టు టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ లెక్కల్లో ఉంది. కానీ సదరు KIFS సంస్థ లెక్కల్లో మాత్రం అది కనిపించకపోవడం విశేషం. రిలయెన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న రాజేష్ ఖండేవాలే ఈ KIFS సంస్థ ప్రమోటర్ కావడం గమనార్హం. అంతేగాకుండా ఖండేవాల్ కూతురు పరిమిళ్ నేత్వాని తనయుడి భార్య కావడం, రిలయెన్స్ గుజరాత్ విభాగానికి నేత్వాని నేత్రుత్వం వహించడమే కాకుండా బీజేపీ మధ్దతుతో జార్ఖండ్ నుంచి రెండు మార్లు ఎంపీగా కొనసాగుతున్న విషయం విశేషం.

pn-04

photo: రాజేష్ ఖండేవాలే వియ్యంకుడు, రిలయన్స్ గుజరాత్ హెడ్ పరిమళ్ మేత్వానీతో అమిత్ షా

జే షా కి చెందిన కంపెనీకి కలుపూర్ కమర్షియల్ ప్రైవేట్ బ్యాంక్ నుంచి 25 కోట్ల రుణం తీసుకున్నట్టు బ్యాలెన్స్ షీట్ లో పేర్కొన్నారు. అది నిర్మా గ్రూప్ సంస్థల యజమాని అంబూభాయ్ మగన్ భాయ్ పటేల్ కి చెందిన బ్యాంక్ కావడం విశేషం. అంతేగాకుండా సదరు బ్యాంక్ కి అమిత్ షాకి చెదిన 5 కోట్ల ఖరీదైన ఆస్తి తనఖా పెట్టినట్టు పేర్కొన్నారు. కానీ సదరు బ్యాంకులో చూపించిన 2002 చదరపు గజాల ఆ ఆస్తిని అమిత్ షా మాత్రం తన లెక్కల్లో చూపించలేదు. షోహబ్రుద్దీన్ కేసులో ఫేక్ ఎన్ కౌంటర్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అమిత్ షా తన వివరాలను సీబీఐకి అందించిన జాబితాలో సదరు బ్యాంకులో చూపించిన ఆస్తుల వివరాలు లేకపోవడం విశేషం. అంతేగాకుండా 7 కో్ట్లు విలువ చేసే ఆస్తి తనాఖా పెట్టుకుని 25 కోట్లను సదరు బ్యాంకు నుంచి రుణంగా పొందడం కూడా మరో ఆశ్చర్యకరమైన అంశం.

అంతటితో సరిపెట్టకుండా మరో 10.35 కోట్లను ప్రభుత్వ రంగ IREDA నుంచి పియూష్ గోయెల్ మంత్రిగా ఉన్న ఇంధన శాఖ నుంచి కేటాయించడం విశేషం. IREDA నుంచి వాయు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కి నిధులు ఇచ్చినట్టు పేర్కొనగా టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ చరిత్రే వేరుగా ఉంది. ఆ ప్లాంట్ ఊసే లేకుండా కంపెనీ మూతపడిన విషయం గమనిస్తే మొత్తం కథ అర్థమవుతుంది. అంతేగాకుండా అమిత్ షా తనయుడు 60శాతాలు వాటాలు కలిగిన కుసుమ్ ఫిన్ సర్వీస్ సంస్థకు కూడా ఖండన్ వాలేకి చెందిన KIFS నుంచి 2.6 కోట్లు చేరడం మరో విచిత్రం. ఇవన్నీ అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత మోడీ ప్రభుత్వ హయంలో జరిగిన తంతు కావడం విశేషం.

ఇక వివిధ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు, దిగుమతులు చేసే సంస్థగా ఉన్న టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ వ్యవహారం అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాగానే పూర్తిగా మారిపోయినట్టు స్పష్టం అవుతోంది. బీజేపీ తరుపున రాజ్యసభలో ఉన్న రిలయెన్స్ సంస్థ ప్రతినిధుల ద్వారా భారీగా సదరు కంపెనీకి నిధులు చేరడం విశేషం. అదే సమయంలో ఆయా కంపెనీల లెక్కల్లో వాటిని చూపించకపోవడం గమనిస్తే క్విడ్ ప్రోకో కథ అర్థం అవుతుంది. మొదటి సంవత్సరం నష్టాలు రావడం, ఆ తర్వాత 2015లో 50వేల రూ.లు లాభం చూపించడం, ఆ వెంటనే లాభాలు 80 కోట్లకు చేరడం, మరుసటి సంవత్సరం కూడా నిండకుండానే కంపెనీ మూతేయడం గమనిస్తే అసలు మతలబు ఇట్టే అర్థం అవుతుంది. ఈ మొత్తం వ్యవహారం డీఎల్ఎఫ్ లో రాబర్ట్ వాద్రా పాత్రను అమిత్ షా తనయుడు జే షా పోషించినట్టు స్పష్టమవుతోంది. మొత్తంగా బీజేపీ పెద్దల తీరు కాంగ్రెస్ బాటలో సాగుతున్నట్టు సుస్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో ఇదో క్విడ్ ప్రోకో అన్న విషయం బహిర్గతమవుతోంది.


Related News

రాధా ముందు నుయ్యి..వెనుక గొయ్యి..!

Spread the love17Sharesవంగ‌వీటి రాధా వ్య‌వ‌హారం ఆసక్తిగా మారుతోంది. వైసీపీలో ఆయ‌న కొన‌సాగుతారా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మూడుRead More

చంద్ర‌బాబు షాకివ్వ‌బోతున్న ఎమ్మెల్యేల జాబితా ఇదే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల విష‌యంలో క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. గ‌తంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *