చంద్రబాబు సీట్లు కథకి చెక్ పెట్టిన షా

22in_lpn_amit naidu
Spread the love

బీజేపీ అధిష్టానం దూకుడు ప్రదర్శిస్తోంది. చంద్రబాబుని అన్నిరకాలుగా కట్టడి చేస్తోంది. దాదాపు అష్టదిగ్బంధనంగా తలపిస్తోంది. అయినా ఏపీ అధికారపక్షం ఏమీ అనలేని స్థితిలో ఉండడం బీజేపీకి బాగా కలిసొస్తోంది. కేంద్రాన్ని నిలదీయలేని చంద్రబాబు చేతగానితనం చివరకు అమిత్ షాకి కూడా ఆసరగా మారింది. ఏపీకి ఏమీ చేయకపోయినా నియోజకవర్గాల పెంపుదల విషయంలో మాత్రం గట్టిగా ప్రయత్నించిన చంద్రబాబు చివరి కోరిక కూడా నెరవేర్చలేదు. పైగా ఏదో జరుగుతోందని బాబు అనుకూల మీడియా కోడై కూసినా ఆఖరికి ఆశలపై నీళ్లు జల్లుతూ అమిత్ షా చేసిన ట్వీట్ సంచలనంగా మారుతోంది.

ఏపీలో నియోజకవర్గాల పెంపుదల ఖాయమని టీడీపీ భావించింది. చివరి క్షణంలోనైనా సీట్లు పెరుగుతాయిన ఆశించింది. కానీ చంద్రబాబు సీట్లు స్టోరీకి అమిత్ షా చెక్ పెట్టేశారు. ఏపీలోని 170 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ సీట్లలోనూ బలపడాలని బీజేపీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణాలో సీట్లను కూడా ఆయన యధావిధిగా ప్రస్తావించారు. తద్వారా పరోక్షంగా డీలిమిటేషన్ ఆశలను తుంచేశారు. ఇది తెలుగుదేశానికి తీరిన తలనొప్పిగా మారే నిర్ణయంగా బావించవచ్చు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పి, అన్ని పార్టీల నేతలకు కండువాలు కప్పిన చంద్రబాబుకి ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితి ఖాయంగా దాపురిస్తోంది.

ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజ్, రైల్వే జోన్, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం పోర్ట్ సహా అనేక చట్టంలోని అంశాలను కూడా విస్మరించేశారు. అయినా తెలుగుదేశం పెద్దగా స్పందించలేదు. కేంద్రాన్ని నిలదీయలేని స్థితి ఉంది. అయినా సీట్ల పెంపుదల కోసం చాలా తీవ్రంగా శ్రమించారు. అనేకరకాలుగా లాబీయింగ్ చేశారు. అయినా ఆఖరికి అమిత్ షా సీట్ల పెంపుదల లేదని తేల్చేయడం టీడీపీని ఇరకాటంలో నెడుతోంది. ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది ఆపార్టీకి అర్థం కాని అంశంగా మారుతోంది. చివరకు ఎలా గట్టెక్కుతుందో అన్నది చర్చనీయాంశంగా మారింది.


Related News

tdp mps meeting

టీడీపీలో రాజ్య‌స‌భ లొల్లి…

Spread the love1Shareఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో వ‌చ్చే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం మూడు సీట్లు ఖాళీRead More

bjp

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

Spread the love1Shareఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లుRead More

 • జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు..
 • గేరు మార్చిన జగన్
 • మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?
 • పవన్ పథకం పారుతుందా..
 • మోడీ ముందు మోకరిల్లిన తెలుగు ఎంపీలు
 • జగన్ ఇరుక్కుంటున్నట్టే
 • బాబుకి బూమరాంగ్ అయ్యింది…!
 • బాబు వద్దంటుంటే..జగన్ కావాలంటున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *