Main Menu

మోడీ, బాబు మధ్య ఆ ఇద్దరే మధ్యవర్తిత్వం

Spread the love

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీరావేశం ప్రదర్శిస్తున్నారు. ప్రధాన మంత్రి పేరు చెప్పగానే పెద్ద స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రేసేతర ప్రతిపక్షాల్లో అందరికన్నా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాయి. మోడీ పీడ విరుగుడయితేనే దేశానికి శ్రేయస్కరమనేంత వరకూ వెళ్లారు. అలాంటి చంద్రబాబు పట్ల కేంద్ర ప్రభుత్వ పెద్దల తీరు మాత్రం ఆశ్చర్యంగా ఉంది. గత ఏడాది మే నెలలోనే తన మీద కుట్ర జరుగుతోందని, రాష్ట్ర ప్రజలంతా వలయంలా ఉండాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ప్రస్తుతం అలాంటి అవకాశం లేదనే ధీమాతో కనిపిస్తున్నారు. తన మీద కేసులు పెడతారని స్వయంగా ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు చెలరేగిపోతున్నారు.

దానంతటికీ కారణం మోడీ మెతక వైఖరేనని ఏపీలోని కొందరు బీజేపీ నేతల వాదన. మోడీని పేరు పెట్టి విమర్శించినా కేంద్రంలోని పెద్దలు చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావడం లేదని, ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తుందంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నా చేసిన సహాయం చెప్పుకునేందకు సిద్ధం కావడం లేదని కమలనాధులే కలవరపడుతున్నారు. మోడీకి, బాబుకి మధ్య ఏదో ఉందని, ఆ కారణంగానే చంద్రబాబు చెలరేగిపోతున్నారని కొందరు సందేహిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ మోడీ దగ్గరకు బాబు వెళ్లినా ఆశ్చర్యం లేదనే వాళ్లూ కూడా లేకపోలేదు.

అయితే చంద్రబాబు ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నా మోడీ ఏమీ చేయలేకపోవడానికి ప్రధాన కారణం అంబానీ , అదానీలేనని పలువురు చెబుతున్నారు. అంబానీ , చంద్రబాబు మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. గత మార్చి నెలలో ముఖేష్ అంబానీ నేరుగా అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ తర్వాతే బాబు బీజేపీకి కటీఫ్ చెప్పడం గమనార్హం. అదే సమయంలో ఏపీలో అదానీకి భారీ కాంట్రాక్టులు కట్టబెట్టడంలో చంద్రబాబు ముందంజలో ఉన్నారు. ఇటీవల డేటా సెంటర్ సహా పలు కాంట్రాక్టులు అదానీకి దక్కాయి. విశాఖ,విజయనగరం జిల్లాల్లో విలువైన భూములను అదానీకి కేటాయించేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు.

మోడీకి మూలస్థంభాలైన ఇద్దరు ప్రముఖులు చంద్రబాబుతో స్నేహం చేస్తున్న తరుణంలో బాబుని, మోడీ ఏమీ చేయలేరనే నిర్థారణకు పలువురు వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్నారు. అంబానీ, అదానీ మద్ధతు కారణంగానే చంద్రబాబు చెలరేగిపోయేందుకు దోహదపడుతోందని చెప్పుకొస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అలాంటి కార్పోరేట్ అధినేతల మద్ధతుతో చంద్రబాబు కేంద్రంలో వ్యూహాలు రచించాలని తపనపడుతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. చూడాలి..బాబు ఆశలు ఏమేరకు నెరవేరుతాయన్నది.






Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *