Main Menu

బాబు, జ‌గ‌న్ కి తొలి ప‌రీక్ష‌, సందిగ్ధంలో ప‌వ‌న్

Spread the love

ఏపీలో ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాల‌కు తొలి ప‌రీక్ష ఎదుర‌వుతోంది. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే పెద్ద ప‌రీక్ష ఎదురుకాబోతోంది. దాంతో అన్ని పార్టీల్లోనూ ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట వ‌చ్చి ప‌డుతున్న పెద్ద‌ల స‌భ‌ల ఎన్నిక‌ల‌తో పెద్ద స‌మ‌స్య త‌ప్ప‌ద‌ని భావిస్తున్నాయి. దాంతో ఆరు నెల‌ల ముందు నుంచే ప‌లువురు నేత‌లు శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు.

వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో ఏపీలోని నాలుగు శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అందులో ఉత్త‌రాంధ్ర టీచ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం, గోదావ‌రి, కృష్ణ‌-గుంటూరు జిల్లాలప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాలు కీల‌కంగా క‌నిపిస్తున్నాయి. ఈ స్థానాల్లో పాగా వేయాల‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఈ మూడు సీట్ల‌కు గానూ రెండు చోట్ల ప్ర‌స్తుతం టీడీపీ కి అనుబంధంగా ఉన్న నేత‌లున్నారు. దాంతో అధికార పార్టీకి వాటిని నిల‌బెట్టుకోవ‌డం అనివార్యం కాబోతోంది.

ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓట‌మి పాల‌య్యింది. తూర్పు, ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌లోని నాలుగు స్థానాల‌కు గానూ నాలుగుచోట్ల ఓట‌మి పాల‌య్యింది. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్స్ సీటుని నాటి మిత్ర‌ప‌క్షం బీజేపీ గెలవ‌డం ఊర‌ట‌నిచ్చిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆ సీటు కూడా విప‌క్షం ఖాతాలోనే ఉండ‌డం విశేషం.

ఈ అనుభ‌వాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా పావులు కదిపేందుకు టీడీపీ స‌న్నాహాలు చేస్తోంది. బ‌ల‌మైన కీల‌క‌నేత‌లను బ‌రిలో దింపే యోచ‌న‌లో క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో వైసీపీ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. తాము అభ్య‌ర్థిని దింపి గెల‌వ‌గ‌ల‌మ‌న్న ధీమా ఉన్న చోట మాత్ర‌మే పోటీ చేయాల‌ని ఆలోచిస్తోంది. రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం-క‌ర్నూలు-క‌డ‌ప ప‌ట్ట‌భ‌ద్రుల సీటులో ఎన్జీవో మాజీ నేత గోపాల రెడ్డిని నిలబెట్టి గెలిపించుకున్న అనుభవంతో అదే విధానం పాటించాల‌ని ఆశిస్తోంది. కానీ ప్ర‌స్తుతం ఆపార్టీకి ఈ మూడుచోట్ల అలాంటి ప‌రిస్థితి ఉండే అవ‌కాశం లేద‌నే అంచ‌నాలున్నాయి.

అదే స‌మ‌యంలో జ‌న‌సేన మాత్రం సందిగ్ధంలో ఉంది. ఇప్ప‌టికే తెలంగాణా అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో తేల్చుకోలేక‌పోతున్న ప‌వ‌న్, ఏపీ శాస‌న‌మండ‌లి సీటు విష‌యంలో కూడా స్ప‌ష్ట‌త‌కు రాలేద‌ని చెబుతున్నారు. దాదాపుగా జ‌న‌సేన పోటీలో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, అసెంబ్లీ ఎన్నిక‌లే టార్గెట్ గా సాగుతుంద‌ని ఆపార్టీ ముఖ్య‌నేత‌ల అబిప్రాయం. దాంతో జ‌న‌సేన పోటీ లో లేక‌పోతే , వైసీపీ వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తే అది టీడీపీ వ్య‌తిరేక పీడీఎఫ్ అభ్య‌ర్థుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా మార‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. గ‌తంలో గోదావ‌రి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన పీడీఎఫ్, ప్ర‌స్తుతం కృష్ణా-గుంటూరు సీటులో సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నారు. దాంతో వారి ప్ర‌భావ‌మే ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం కాబోతోంది.






Related News

వైసీపీ ని టెన్ష‌న్ పెడుతున్న తెలంగాణా!

Spread the loveరాజ‌కీయాల్లో చిన్న అవ‌కాశాన్ని కూడా సానుకూలంగా మ‌ల‌చుకున్న వారే రాణిస్తారు. చిన్న చిన్న అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకోవ‌డంలోRead More

జగన్ నోరు తెరిస్తే…!

Spread the loveఏపీ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు తప్పవనిపిస్తోంది. రాజకీయంగా మళ్లీ వేడి రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే మూడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *