Main Menu

అలీ అవి అడిగితే..జ‌గ‌న్ కాద‌న్నారా?

Spread the love

సినీ క‌మెడియ‌న్ అలీ రాజ‌కీయ వ్య‌వ‌హారాలు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఆస‌క్తిగా త‌యార‌వుతున్నాయి. స‌హ‌జంగా రెండు ప‌డ‌వ‌ల మీద కాళ్లు వేయ‌డం అంటారు గానీ, అలీ మాత్రం మూడు ప‌డ‌వ‌ల మీద కాళ్లేశారు. మూడు పార్టీల‌లోనూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎవ‌రు త‌న‌కు ఎమ్మెల్యే సీటు తో పాటు, మంత్రి ప‌ద‌వి గ్యారంటీ ఇస్తారో ఆపార్టీలో చేర‌బోతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సినీ న‌టులు పొలిటిక‌ల్ ఎంట్రీ పెద్ద విశేషం కాదు. ఓ సినీ స్టార్ హీరో సొంతంగా పార్టీ న‌డుపుతుంటే, ఓ న‌టీమ‌ణి ఎమ్మెల్యే గానూ, మ‌రో హీరో ఎమ్మెల్యేగా ఉన్న ఏపీలో అలీ వ్య‌వ‌హార‌మే హాట్ టాపిక్ అవుతోంద‌. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తేనే పార్టీలో చేర‌తాన‌ని చెప్ప‌డం విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది. అలీ అనుభ‌వ లేమితో అలా అడుగుతున్నారా లేక అవ‌కాశ‌వాదానికి ప‌రాకాష్ట‌గా మారిన‌ట్టుగా చెప్ప‌వ‌చ్చా అన్న‌ది సందేహ‌మే. అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయాల్లో చేర‌డంతోనే ఆలు లేదు చూలు లేదు అన్న‌ట్టుగా మంత్రి ప‌ద‌వి కోర‌డం విచిత్రంగా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత అడ‌గాల్సిన దాని కోసం ముందే ప‌ట్టుప‌ట్టి ముప్పు తెచ్చుకుంటున్న‌ట్టుగా ఉంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే అలీ తొలుత వైసీపీ అధినేత జ‌గన్ తో భేటీ అయ్యారు. ఆ సంద‌ర్భంగా సీట్ల విష‌యంలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టుగా స‌మాచారం. అలీ క‌ర్నూలు గానీ క‌డ‌ప గానీ ఎమ్మెల్యే స్థానాలు తొలి ప్రాధాన్య‌త‌గా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. జ‌గన్ మాత్రం స‌త్తెన‌ప‌ల్లి ఆఫ‌ర్ చేయ‌డంతో అలీ గుంటూరు కోరార‌ని చెబుతున్నారు. దానికి జ‌గ‌న్ నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో జ‌న‌సేనానిని ఆశ్ర‌యించిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అక్క‌డ కూడా నిర్థిష్ట అసెంబ్లీ సీటు విష‌యంలో స్ప‌ష్ట‌త లేక‌పోవడంతో వెంట‌నే టీడీపీ అధినేత‌ను కూడా క‌ల‌వ‌డం అలీ మ్యూజిక‌ల్ చెయిర్స్ ఆడుతున్న‌ట్టుగా ఉంద‌ని చెబుతున్నారు.

టీడీపీలో అలీకి క‌డ‌ప సీటు ఖాయం చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. జ‌న‌సేన గుంటూరు స్థానం ఇస్తాన‌ని చెబుతున్న‌ప్పటికీ అలీ సందిగ్ధంలో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. మొత్తంగా అలీ వ్య‌వ‌హారం ఆఖ‌రికి ఎటు మ‌ళ్లుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా త‌యార‌య్యింది.






Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *