చంద్రబాబుపై అలకబూనిన మంత్రి

bhuma cbn
Spread the love

తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా అధినేత చెప్పిందే వేదంగా వ్యవహరించిన పార్టీలో తాజాగా అధ్యక్షుడి తీరుతో అమాత్యులే అలకబూనే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు వైఖరి పట్ల గుర్రుగా ఉన్న మంత్రి అఖిలప్రియ అలకబూనినట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి వైఖరితో మొఖం మాడ్చుకున్న అఖిలప్రియ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. దాంతో ఈ పరిణామం తెలుగుదేశం వర్గాల్లో విస్త్రుత చర్చకు దారితీస్తోంది.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఉన్న విబేధాలు రచ్చకెక్కాయి. ఏకంగా ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, సమస్యలన్నీ నాకే చెప్పుకోండి అంటూ సుబ్బారెడ్డి ప్రచారం చేస్తుండడం, వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినని చెబుతుండడం అఖిలప్రియకు గిట్టడం లేదు. భూమా నాగిరెడ్డి అనుచరుడికి, ఆయన వారసురాలికి మధ్య ఏర్పడిన వివాదంతో ఆళ్లగడ్డ టీడీపీ వర్గాలు కూడా రెండుగా చీలిపోయిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు. తన నియోజకవర్గంలో మరో నాయకుడి పెత్తనం గురించి పట్టించుకోకపోవడంతో కలత చెందినట్టు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తనకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన అఖిలప్రియలో మొదలయ్యింది. ఇప్పటికే వచ్చే ఎన్నికలకి నంద్యాల ఎంపీ సీటు కేటాయించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. దానిలో భాగంగానే సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డలో ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ పరిస్థితుల్లో తనకు నంద్యాల ఎంపీ సీటుకన్నా, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానమే శ్రేయస్కరమని అఖిలప్రియ భావిస్తోంది. దాంతో తాను గట్టిగా పట్టుబట్టాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్టు కనిపిస్తోంది. సుబ్బారెడ్డితో తాడోపేడో తేల్చుకోవడంతో పాటు ఆళ్లగడ్డ విషయంలో స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఈ పరిణామంతో అప్రమత్తమయిన టీడీపీ నాయకత్వం రంగంలో దిగింది. మంత్రి కాల్వ శ్రీనివాసులు, టీడీపీ నేత వర్ల రామయ్య చర్చలు ప్రారంభించారు. అఖిలప్రియతో మాట్లాడి అసంత్రుప్తి చల్లార్చాలని చూస్తున్నారు. మంత్రివర్గంలో చివరకు తన సొంత శాఖలో కూడా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్న ఆమె వాదనను అధినేత ముందుకు తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ వ్యవహారం అమరావతిలో కాకపుట్టిస్తుందా అన్న చర్చ మొదలయ్యింది.


Related News

tv9 srini raju

రాజ‌కీయ రంగంలో టీవీ9 యాజ‌మాన్యం

Spread the loveటీవీ9 చానెల్. తెలుగులో పేరెన్నిక‌గ‌న్న చానెల్. న్యూస్ చానెళ్ల విభాగంలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. అందుకుRead More

9173_ysrcp-3

వైసీపీది వాపా?..బ‌ల‌మా??

Spread the loveవైసీపీలో ఊహించ‌ని ప‌రిణామాలు సాగుతున్నాయి. కొత్త ఊపు క‌నిపిస్తోంది. హోదా ఉద్య‌మం, బాబు యూ ట‌ర్న్ వ్య‌వ‌హారంRead More

 • ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!
 • టీడీపీ ఏం చెప్పుకోవాలి…?
 • బాబు బ‌లం మీద దెబ్బ కొడుతున్నారు..
 • బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!
 • జ‌గ‌న్ పార్టీలోకి జంపింగ్ లు షురూ!
 • పవన్ కి పరిష్కారం అతడే..
 • ఆ ఇద్ద‌రూ త‌ప్ప..అంద‌రితోనూ అంటున్న టీడీపీ
 • పవన్ సీన్ మార్చేస్తారా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *