Main Menu

జగన్ గుణపాఠం నేర్చుకుంటారా?

jagan in nandyala
Spread the love

ఎదురుదెబ్బలు తగిలినప్పుడే అసలు నైజం బయటపడుంది. దానిని తట్టుకుని నేర్చుకున్న వారే ఎదుగుతారు. గుణపాఠాలు తీసుకున్న వారే ముందడుగు వేస్తారు. అందుకే ఇప్పుడు జగన్ నంద్యాల ఫలితాల తర్వాత ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారనే చర్చ మొదలయ్యింది. వాస్తవానికి జగన్ కి గతంలోనే పలు అనుభవాలున్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేజేతులా ఓటమి కొనితెచ్చుకున్న అనుభవం 2014లోనే ఉంది. అయినా 2017లోనూ అదే రీతిలో ప్రవర్తించిన నంద్యాలను కోల్పోయారనే వాళ్లు కనిపిస్తున్నారు. ప్రచారంలో తన వెంటవస్తున్న ప్రజలను చూసుకుని మురిసిపోయి పోల్ మేనేజ్ మెంట్ వ్యవస్థను పక్కన పెట్టేయడం వల్లే చేజేతులా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.

ఇలాంటి ప్రచారంలో వాస్తవం కూడా కొంత కనిపిస్తోంది. కానీ తాజాగా నంద్యాల ఎన్నికల్లో తనకు కలిసొచ్చిన సామాజిక వర్గాలదే ప్రధాన పాత్ర అయినప్పటికీ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోవడం జగన్ వైపల్యమే. ప్రత్యర్థులు తన బలం మీద కన్నేసి పావులు కదుపుతున్నా కాసుకోలేకపోవడం ఆయన బలహీనతగానే బావించాలి. చివరకు మైనార్టీల నమ్మకాన్ని కోల్పోయిన విషయం వైసీపీ పునాదికే ప్రమాదం కాబోతోంది. ఇక రెడ్డి సామాజికవర్గం కూడా జగన్ ని కాదని, టీడీపీని ఆదరించడం మొదలెడితే వైసీపీ ఉనికి గగనంగా మారడం ఖాయం. అందుకే జగన్ దానికి కారణాలు అన్వేషించాలి. ప్రమాదాన్ని గ్రహించి పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. లేకుంటే సమస్యలు తప్పవు.

ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో జగన్ జెండా బాగా ఎగిరింది రాయలసీమలో. దానికి కారణం రెడ్డీ, ఎస్సీ, మైనార్టీ కాంబినేషన్ పనజేయడమే. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఎస్సీలు జగన్ వెంటనడిచినా రెడ్లు, మైనార్టీలు దూరమయిన విషయాన్ని అంగీకరించాల్సిందే. అది ఉప ఎన్నికలే కావచ్చు. ప్రభావితాంశాలు వేరుగా ఉండవచ్చు. కానీ వైసీపీకి పునాది వర్గాల్లోనే పట్టు నిలుపుకునే పరిస్థితి లేకపోవడం ప్రమాద సంకేతం. జగన్ పార్టీ భవిష్యత్తు మీద ప్రభావితం చేసే అంశంగా ఉంది. మైనార్టీలకు తెలుగుదేశం చేసిన అన్యాయం అందరికీ తెలుసు. ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా, అంతకుముందు ఎన్నికల్లో కేవలం ఒకే ఒక అసెంబ్లీ సీటుతో సరిపెట్టిన సంగతి కూడా తెలిసిందే. అయినా మైనార్టీలలో జగన్ కన్నా బాబుకే ఆదరణ దక్కడం ఆశ్చర్యం. దానికి కారణాల్లో శిల్పా మీద వ్యతిరేకతగా కొందరు భావిస్తున్నారు. అయినా ఈ పోటీ మాత్రం జగన్ , బాబు మధ్యే అన్నట్టుగా సాగిన సంగతిని గుర్తిస్తే జగన్ ని కూడా మైనార్టీలు విశ్వసించలేదని భావించాలి.

ఇటీవల రామ్ నాథ్ కోవింద్ కి జగన్ కి మద్ధతివ్వడం ద్వారా మైనార్టీలో విశ్వాసాన్ని చాలావరకూ కోల్పోయినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే బీజేపీతో ఉన్నప్పటికీ కొత్తగా బీజేపీ ప్రభుత్వ నిర్వాహకాలు తెలిసిన తర్వాత వారితో జతగట్టిన జగన్ మీదే మైనార్టీలలో అపనమ్మకం మొదలుకావడం విశేషం. అంతేగాకుండా రెడ్డి సామాజికవర్గం కూడా సంపూర్ణంగా జగన్ తో ఉండాల్సిన సమయంలో చీలిక రావడం చర్చనీయాంశమే. ఈ ఎన్నికల జగన్ ది కాకపోవడం, పోటీలో కూడా రెడ్డి సామాజికవర్గమే ఉండడంతో కొంత ఓటు బ్యాంకు చెదిరినప్పటికీ దానికి మించిన ప్రభావం నంద్యాలలో స్పష్టంగా ఉంది. ఇక పునాది వర్గాల్లోనే ఇలాంటి సంకేతాలు వస్తే జగన్ కి కలిసిరావాల్సిన వర్గాలు చేరువ కావాల్సింది పోయి మరింత దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే సీమలో బలిజ, కోస్తాలు కాపులు ఇప్పుడు బాబు మీద వ్యతిరేకతతో జగన్ ని బలపరచాల్సి ఉంది. కానీ నంద్యాల బలిజలు ఆశించినట్టుగా జగన్ ని కాకుండా బాబు కి అయిష్టంగానైనా ఓటేయడం విశేషంగా మారుతోంది.

ఉప ఎన్నికల్లో ప్రభావితాంశాలు వేరుగా ఉండవచ్చు, ఫలితాలకు కారణాల్లో సామాజిక పొందికను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న సంకేతం ముఖ్యమైనది. వైసీపీ మనుగడకు మూలమైనది. అది కాదని, అక్కడ నమ్మకాన్ని నిలబెట్టుకోలేని స్థితి కొనితెచ్చుకుని ఆ తర్వాత ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉండదు. అందుకే జగన్ గుణపాఠం తీసుకుంటారా లేక యధావిధిగా సాగిపోతారా అన్నది ఆయన భవిష్యత్తుని నిర్ధేశించబోతోంది.


Related News

ANNACANTEEN

అన్న క్యాంటీన్లు- అస‌లు మ‌త‌ల‌బు

Spread the loveఏపీలో ఎంతో అభివృద్ధి జ‌రిగింద‌ని, దేశ‌మ‌యితే ఎంతో అభివృద్ధి చెందుతోంద‌ని నేత‌లు అదే ప‌నిగా ప్ర‌చారార్భాటం చేస్తున్నRead More

tdp

వార‌సుల కోసం నేత‌ల పాట్లు

Spread the loveప్ర‌జాస్వామ్యంలో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కొద‌వ ఉండ‌డం లేదు. ప్ర‌ధాన పార్టీల‌న్నింటా అదే తంతు కనిపిస్తోంది. ఒక‌ప్పుడు కాంగ్రెస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *