రాజ‌కీయ రంగంలో టీవీ9 యాజ‌మాన్యం

tv9 srini raju
Spread the love

టీవీ9 చానెల్. తెలుగులో పేరెన్నిక‌గ‌న్న చానెల్. న్యూస్ చానెళ్ల విభాగంలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే వివాదాల్లో కూడా ఉంటుంది. అయితే అనేక ఏళ్లుగా ఎవ‌రికి ఎటువంటి వివాదం ఉన్న‌ప్ప‌టికీ అంద‌రూ టీవీ9 పేరు చెప్ప‌గానే రవిప్ర‌కాష్ మీద విమ‌ర్శ‌లు చేసేవారు. ఆయ‌న తీరుని నిర‌సించేవారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కామెంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు తొలిసారిగా జ‌న‌సేన అధినేత రూటు మార్చారు. ఆయ‌న టీవీ9 మీద విమ‌ర్శ‌ల‌ను ఏకంగా శ్రీనిరాజు మీద గురిపెట్టారు. శ్రీనిరాజు స‌ద‌రు చానెల్ లో 88.69 శాతం వాటా క‌లిగిన వ్య‌క్తి అంటూ ప‌వ‌న్ పేర్కొన్నారు. దాంతో ఇది విశేషంగా మారింది.

ప్ర‌స్తుతం ఫిల్మ్ ఛాంబ‌ర్ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌న త‌ల్లి మీద వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. దానికి వంత‌పాడిన చానెళ్ళ మీద ఘాటుగా స్పందిస్తున్నారు. రాజ‌కీయంగా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ మీద గురిపెట్టారు. అదే క్ర‌మంలో మీడియా యాజ‌మాన్యాల‌ను కూడా వ‌దిలిపెట్ట‌కుండా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే శ్రీనిరాజు వ్య‌వ‌హారాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. శ్రీనిరాజు గ‌తంలో కాంగ్రెస్ హ‌యంలో శ్రీ సిటీ పేరుతో సెజ్ తీసుకున్న విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తు చేశారు. అంతేగాకుండా స‌త్యం రామ‌లింగ‌రాజుకి, వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కి బంధువు అనే అంశాన్ని ప్ర‌స్తావించారు. త‌ద్వారా శ్రీనిరాజు నేప‌థ్యాన్ని అంద‌రికీ ప‌రిచయం చేసే ప్ర‌య‌త్నం సాగించిన‌ట్టు క‌నిపిస్తోంది.

త‌న త‌ల్లిని విమ‌ర్శించిన వారిని, వారికి అండ‌గా నిలిచివారిని వ‌దిలిపెట్టేది లేదంటూ ప‌వ‌న్ చేస్తున్న ఆందోళ‌న నేప‌థ్యంలో శ్రీనిరాజుకి సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. స‌ద‌రు టీవీ9 య‌జ‌మాని శ్రీనిరాజు క్లాస్ మేట్, న‌మ‌స్తే తెలంగాణా ప‌త్రిక వ్య‌వ‌స్థాప‌కుడు, తాజాగా మెట్రోఇండియా ప‌త్రిక ఎండీ సీఎల్ రాజం కి వియ్యంకుడు కూడా అని చెబుతున్నారు. రాజం కూతురిని శ్రీనిరాజు త‌న‌యుడు కార్తీక్ వివాహం చేసుకోవ‌డం విశేషం. అంతేగాకుండా డెక్క‌న్ హోల్డింగ్స్ లో వాటాదారుడిగా మారుతున్న‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. మొత్తంగా ప‌వ‌న్ జోక్యంతో శ్రీనిరాజు వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. రాజకీయ హాట్ టాపిక్ అవుతోంది. గ‌తంలో కాంగ్రెస్ పాల‌న‌లో వైఎస్ తో, ప్ర‌స్తుతం టీడీపీ చంద్ర‌బాబుతో ఉన్న స‌న్నిహిత సంబంధాల‌పై చ‌ర్చ మొద‌ల‌య్యింది.


Related News

chandrababu naidu - PTI_1

తెగే వరకూ లాగితే చిరిగిపోతుంది బాబూ..!

Spread the loveకొన్ని వ్యవహారాలు అంతే. కక్కాలేక మింగాలేకా అన్నట్టుగా ఉంటాయి. తాజాగా టీటీడీ వివాదం కూడా అంతే. చంద్రబాబుRead More

tdp-bjp-fg647x450

బీజేపీకి ఒక నీతి, టీడీపీ, వైసీపీ మరో రీతి..

Spread the love5Sharesకర్ణాటకలో ఆశ్చర్యకర పరిణామాల నుంచి ఇంకా చాలామంది పూర్తిగా కోలుకోలేదు. అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం మూణ్ణాళ్లకే మూటRead More

 • బీజేపీ చారిత్రక తప్పిదం…!
 • చంద్రబాబు వెనకడుగు
 • బాబుకి మంట పెడుతున్న బీజేపీ
 • చంద్రబాబుకి శిక్ష తప్పదా..?
 • అవకాశాలు చేజార్చుకుంటున్న జగన్
 • అయోమయమా..అవగాహనా లోపమా?
 • చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?
 • ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *