Main Menu

సిక్కోలులో జ‌గ‌న్ కి చికాకే..!

YS Jaganmohan Reddy
Spread the love

శ్రీకాకుళం జిల్లా రాజ‌కీయాలు జ‌గ‌న్ కి చికాకు క‌లిగిస్తున్నాయి. సామాజిక స‌మీక‌ర‌ణాలు ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఖంగుతిన్న‌ప్ప‌టికీ ఈసారి కోలుగోల‌మ‌ని ఆశిస్తుంటే పార్టీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు అస‌లుకే ఎసరు తెచ్చేలా ఉంది. దాన్ని స‌ర్థిచెప్ప‌డానికి జ‌గ‌న్ స‌త‌మ‌తం కావాల్సి వ‌స్తోంది. ఉత్త‌రాంద్ర‌లో చివ‌ర‌న ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ ఉద్దండుల‌కు నిల‌యం శ్రీకాకుళం. ఎర్ర‌న్నాయుడు,ద‌ర్మాన వంటి వారి త‌ర్వాత ప్ర‌స్తుతం అచ్చెన్న చ‌క్రం తిప్పుతున్నారు. క‌ళా వెంక‌ట్రావు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి ప్రాంతంలో ప‌ట్టు సాధించాలంటే వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం ఆపార్టీకి అదే క‌రువ‌య్యింది. ఒక వేళ ఉన్నా అది ఆచ‌ర‌ణలో క‌నిపించ‌కుండా పోయింది.

శ్రీకాకుళం జిల్లాలో గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచిన వారిలో క‌ల‌మ‌టి వారు పార్టీ మారిపోయారు. ఆత‌ర్వాత ఇచ్ఛాపురం, టెక్క‌లి సీట్ల‌లో నేత‌లు సెల‌వు చెప్పేశారు. మ‌రికొన్ని చోట్ల పార్టీలో అంత‌ర్గ‌త విబేధాలు తార‌స్థాయిలో క‌నిపిస్తున్నాయి. అన్నింటికీ మించి జిల్లా కేంద్రంలో పార్టీ అధ్య‌క్షురాలు రెడ్డి శాంతికి, కీల‌క నేత‌లు ధ‌ర్మాన ఫ్యామిలీకి మ‌ధ్య దూరం పెరుగుతోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసిన రెడ్డి శాంతి ప‌రాజ‌యం పాల‌య్యారు. అయినా పార్టీ కోసం శ్ర‌మిస్తున్నారు. జిల్లాలో కాస్త క‌ష్ట‌ప‌డుతున్న నాయ‌కురాలిగా గుర్తింపు సాధించారు. ప్ర‌జ‌ల కోసం ఎంతో కొంత ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే పేరు ఉంది. అదే స‌మ‌యంలో ధ‌ర్మాన వ్య‌వ‌హారం మాత్రం చాలామందికి మింగుడుప‌డ‌డం లేదు. శ్రీకాకుళం న‌గ‌రంలో కీల‌క స‌మ‌స్య‌ల మీద చేయాల్సిన పోరాటాలు కూడా ఆయ‌న విస్మ‌రిస్తున్నారు. ధ‌ర్మాన కృష్ణ‌దాస్ కొంత ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌సాద‌రావు మాత్రం రాష్ట్ర‌స్థాయి వ్య‌వ‌హారాల‌కు ప‌రిమితం అవుతున్నారు.

అయినా రెడ్డి శాంతికి సానుకూల‌త క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం సామాజిక స‌మీక‌ర‌ణాలే. శ్రీకాకుళంలో కాళింగ‌లు, కొప్పుల వెల‌మ‌ల‌దే ప్ర‌ధాన స్థానం. ఆ త‌ర్వాత తూర్పు కాపులు కొన్ని చోట్ల ప్ర‌భావితం చేస్తారు. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్ప‌టికీ క‌ళా వెంక‌ట్రావు క‌న్నా అచ్చెన్నాయుడిదే పై చేయి కావ‌డానికి అక్క‌డున్న సామాజిక స‌మీక‌ర‌ణాలే ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాయి. వైసీపీలో కూడా అదే ప‌రిస్థితి. రెడ్డి శాంతి క‌ష్ట‌ప‌డుతున్న‌ప్ప‌టికీ పెత్త‌నం మాత్రం ధ‌ర్మాన వారిదే అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా సానుకూల సంకేతాలు ఇస్తుండ‌డంతో ఆమెను చేర్చుకుంటే రెడ్డి శాంతి ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారుతుంద‌నే వాద‌న ఉంది. ఇప్ప‌టికే ధ‌ర్మాన బ్ర‌ద‌ర్స్ తో పాటు వార‌సుడు కూడా క్యూలో ఉన్నారు. ఇక కొత్త నేత‌ల‌ను చేర్చుకుంటే ఏం చేయాల‌న్న‌ది అర్థం కాకుండా ఉంది.

అదే స‌మ‌యంలో రెడ్డి శాంతిని మ‌రోసారి రంగంలో దింపాల‌ని ప్ర‌య‌త్నిస్తే సోష‌ల్ ఇంజ‌నీరింగ్ దెబ్బ త‌ప్ప‌ద‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లోనే సిక్కోలులో జ‌గ‌న్ కి పెద్ద సంక‌టంగా మారుతోంది. ఇప్ప‌టి నుంచే వ్య‌వ‌హారం చ‌క్క‌దిద్ద‌క‌పోతే చివ‌రినిమిషంలో స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు కాబ‌ట్టి ప్ర‌త్యేక దృష్టిపెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర‌కు ఏరీతిలో కొలిక్కివ‌స్తుందో చూడాలి.


Related News

YS-Jagan-Botsa-Satyanarayana

ప‌ట్టు కోసం పాకులాడుతున్న బొత్సా

Spread the love8Sharesఏపీ రాజ‌కీయాల్లో బొత్సాది ఓ భిన్న‌మైన శైలి. ఆయ‌న ఏమి చేసినా అది రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంటుంది.Read More

ashokgajapathiraju-kAV--621x414@LiveMint

మాజీ మంత్రికి రాచ‌మ‌ర్యాద‌లు

Spread the love4Sharesఆయ‌న అస‌లే రాజుగారు. అందుకేనేమో పోలీసులు కూడా రాచ‌మర్యాదలు చేశారు. అమాత్య హోదాని వ‌దులుకున్నా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *