వైసీపీకి ఝలక్!

వైసీపీకి మరో ఝలక్ తప్పేలా లేదు. త్వరలోనే ఆపార్టీని వీడేందుకు మాజీ ఎమ్మెల్యే ఒకరు రంగం సిద్ధం చేసుకున్నారు. అది కూడా వైసీపీ సీనియర్ నేత బంధువు కావడం విశేషం. దాంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అవుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కి స్వయంగా వియ్యపురాలు అయిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సన్నద్ధమయ్యారు.
ఆవెంటనే ఆమె జనసేనకు జై కొట్టేందుకు రంగం సిద్దమయ్యింది. ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయి. గతంలో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె వచ్చే ఎన్నికల్లో విజయం కోసం తహతహలాడుతున్నారు. అయితే వైసీపీలో సీటు దక్కే ఛాన్స్ కనిపించకపోవడంతో జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. పవన్ పార్టీ నేతలు సానుకూలంగా స్పందించడంతో ఆమె చేరిక ఖాయం అయ్యింది. ముఖ్యంగా మాజీ మంత్రి బాలరాజు ఈ విషయంలో పలుమార్లు చర్చలు జరిపి ముత్యాలపాప చేరికకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
వైసీపీ నేతలు కూడా వెంటనే అప్రమత్తమయ్యి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. కానీ తనకు సీటు గ్యారంటీ ఇస్తే తప్ప తాన చేరిక ఆగదని స్పష్టం చేసినట్టు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలోనే ముత్యాల పాప జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయం అంటున్నారు. ఈ వ్యవహారం ధర్మానకు కూడా తలనొప్పిగా మారినట్టు చెబుతున్నారు. ఏమయినా నర్సీపట్నంలో వైసీపీకి ఇది ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
Related News

టీడీపీ ఎమ్మెల్యేకి కోర్ట్ సమన్లు
Spread the loveటీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇక్కట్లలో పడ్డారు. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆమెకుRead More

పవన్ కళ్యాణ్ ప్రశంసలు పొందిన యువనేత
Spread the loveజనసేన అడుగులు కొత్త పంథాలో సాగుతున్నాయి. నవ తరాన్ని రాజకీయంగా ఎదిగే దిశలో ప్రోత్సహించేందుకు జనసేనాని కీలకRead More