విశాఖ‌లో వివాదం:టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి

ganta ayyanna
Spread the love

ఇప్ప‌టికే క‌ర్నూలు జిల్లాలో క‌ల‌హం రాజుకుంది. ఆళ్ల‌గ‌డ్డ సాక్షిగా అల‌జ‌డి రేగుతోంది. అద్దంకి త‌గాదా చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. క‌దిరి క‌ల‌హం తీర‌దా అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. అందుకు తోడుగా తాజాగా మ‌రోసారి విశాఖ తీరంలో కూడా వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య విబేధాలు మ‌ళ్లీ భ‌గ్గుమ‌న్నాయి. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య చాలాకాలంగా ఉన్న విబేధాలు చ‌ల్లారిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ తాజాగా జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) కమిటీ నియామకం పేరుతో ముందుకొచ్చాయి. త‌న మాట‌ను ఖాత‌రు చేసినందుకు మంత్రి అయ్య‌న్న భ‌గ్గుమంటున్నారు. ఏకంగా క‌లెక్ట‌ర్ మీద కూడా ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాజ‌ప్ప ఎదురుగా ర‌గిలిపోయారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 2013లో నర్సీపట్నానికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు రాఘవేంద్రరావును చైర్మన్‌గా.. మరో 15 మందిని సభ్యులుగా నియమిస్తూ కమిటీని నియమించింది. రాఘవేంద్రరావు ఇంతకుముందు కూడా ఐదేళ్లు చైర్మన్‌గా ఉన్నారు. తెలుగుదేశం 2014లో అధికారంలోకి వచ్చింది. పాత కమిటీలన్నీ రద్దయి.. చైర్మన్లు, సభ్యులంతా రాజీనామాలు చేయాలి. విశాఖపట్నంలో అలా జర గలేదు. డీడీఎల్‌ఏ ఐదేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకుంది. గత నెల ఐదో తేదీతో గడువు ముగిసింది. కొత్త కమిటీ వేయాల్సి వచ్చింది. గత పదేళ్లుగా కొనసాగుతున్న కమిటీనే కొనసాగించాలని అయ్యన్నపాత్రుడు గత నెల 19న కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ విషయం తెలియని పశు సంవర్థక శాఖ అధికారులు ఎన్నిక నిర్వహణపై 21న కలెక్టర్‌కు లేఖ రాశారు. అటు నుంచి సమాధానం రాలేదు. పశు సంవర్థక శాఖ ఎగ్జిక్యూటివ్‌ అధికారి గత నెల 27న డీఎల్‌డీఏ కమిటీకి 16 మందిని నియమించారు. దీనికి చైర్మన్‌గా మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గానికి చెందిన గాడు వెంకటప్పడును నియమించారు. విషయం తెలిసి అయ్యన్న అగ్గిమీద గుగ్గిలమయ్యారు. చినరాజప్ప ముందు ఆగ్రహం వ్యక్తంచేశారు. సాయంత్రంలోగా కమిటీలో మార్పులు చేయకపోతే పదవి వదులుకుంటానని హెచ్చరించారు. అప్పటికప్పుడే కలెక్టర్‌తో చినరాజప్ప ఫోన్‌లో మాట్లాడారు. ఆయనతోపాటు అయ్యన్న కూడా ఫోన్‌లో మాట్లాడారు. మంత్రులంటే తమాషాగా ఉందా అని మండిపడ్డారు. తనకు తెలియకుండా నియామకం జరిగిందని కలెక్టర్‌ వివరణ ఇచ్చారు. సాయంత్రం ఈ కమిటీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే మంత్రి గంటా ప్రోద్భ‌లంతోనే ఇలాంటి క‌మిటీని నియ‌మించిన‌ట్టు, త‌న మాట‌ను కాద‌ని, మ‌రో మంత్రికి ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు అయ్య‌న్న భావిస్తున్నారు. దానికి ప్రతిగా త‌గిన రీతిలో చ‌ర్య‌లుంటాయ‌ని మంత్రి అనుచ‌రులు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి క‌మిటీ ర‌ద్ద‌యిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ రాఘ‌వేంద్ర‌రావుకి అవ‌కాశం ద‌క్కాల్సిందేన‌ని ప‌ట్టుబడుతున్నారు. అది జ‌ర‌గ‌క‌పోతే జిల్లాలో తానేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంద‌ని అయ్య‌న్న ఆలోచిస్తున్న‌ట్టు చెబుతున్నారు.ఈ విష‌యంలో టీడీపీ ఎమ్మెల్యేలంతా గంటా, అయ్య‌న్న మ‌ధ్య చెరో కొంద‌రు చేరిపోవ‌డంతో పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. ఇన్ఛార్జ్ మంత్రి రాజ‌ప్ప కూడా ఏం చేయ‌గ‌ల‌ర‌న్న‌ది సందేహంగా మారుతోంది.


Related News

vizag-south-vasupalli-ganesh-kumar-tdp-140048322520-10-1489122042

అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు

Spread the loveటీడీపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కారు. అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. ఏకంగా పార్టీ కార్యాల‌యం ముందు నిర‌స‌న చేప‌ట్టారు.Read More

Haribabu bjp

హ‌రిబాబు ప‌ద‌వి అందుకే పోయింది…!

Spread the loveఎట్ట‌కేల‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మారుతున్నాడు. నాలుగేళ్లుగా అనేక ప్ర‌యత్నాలు చేసినా సాధ్యం కానిది అనూహ్యంగా జ‌రిగింది.Read More

 • జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!
 • డ్యాన్ల‌ర్ల‌తో క‌లిసి చిందేసిన ఏపీ మంత్రి
 • రెచ్చిపోయిన అయ్య‌న్న అనుచ‌రులు
 • టీడీపీ మంత్రుల‌ త‌గాదాతో అధికారుల‌కు తంటా..
 • విశాఖ‌లో వివాదం:టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి
 • తెలుగు త‌మ్ముళ్ల త‌న్నులాట‌
 • సిట్టింగుల‌కు షాకివ్వ‌బోతున్న బాబు
 • ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *