Main Menu

అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు

Spread the love

టీడీపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కారు. అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. ఏకంగా పార్టీ కార్యాల‌యం ముందు నిర‌స‌న చేప‌ట్టారు. విశాఖ న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా వాసుప‌ల్లి గణేష్ కుమార్ వైదొల‌గాల‌ని డిమాండ్ చేశారు. ఆయ‌న్ని పార్టీ అద్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని నినాదాలు చేశారు. విశాఖ న‌గ‌రంలో పార్టీ ప‌రువుని ఎమ్మెల్యే వాసుప‌ల్లి గంగ‌లో క‌లుపుతున్నార‌ని కార్య‌క‌ర్త‌లు వాపోయారు. ఏకంగా డివిజ‌న్ అధ్య‌క్షుల నియామ‌కంలో భారీగా లంచాలు తీసుకున్నార‌ని ఆరోపించారు. లంచాలిచ్చిన వారికి పార్టీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం అన్యాయ‌మ‌న్నారు. పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌ను ప‌క్క‌న పెట్టి, లంచం ఇచ్చిన అన‌ర్హుల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన వాసుప‌ల్లిని అధ్య‌క్షుడిగా కొన‌సాగించ‌డం స‌రికాద‌న్నారు. ఆయ‌న్ని త‌క్ష‌ణం తొల‌గించాలంటూ విశాఖ న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యం ముందు ధ‌ర్నా చేప‌ట్టారు. దాంతో ఈ వ్య‌వ‌హారం విశాఖ రాజకీయాల్లో క‌ల‌కలం రేపుతోంది.

ఇప్ప‌టికే రూర‌ల్ లో మంత్రులు గంటా, అయ్య‌న్న మధ్య అగ్గిరాజుకుంటోంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన వారి వైరం చ‌ల్లార‌క‌పోగా మ‌రింత చెల‌రేగిపోతున్నారు. ఇప్పుడు న‌గ‌ర పార్టీలో కూడా చిచ్చు రాజుకోవ‌డంతో తెలుగుదేశం శ్రేణులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.






Related News

వివాదంలో అచ్చెన్న సోద‌రుడు

Spread the loveఅధికారుల వ్య‌వ‌హారాల్లో రాజ‌కీయాలు జోక్యం చేసుకోవ‌డం చాలాకాలంగా సాగుతున్న తంతు. కానీ ఇప్పుడు అధికారుల్లో రాజ‌కీయాల్లో భాగ‌స్వాములవుతున్నారు.Read More

బాబు చుట్టూ భోగాపురం రగడ

Spread the loveభోగాపురం ఎయిర్ పోర్ట్ వ్యవహారం చంద్రబాబు సర్కారు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్ట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *