హ‌రిబాబుకి అన్నీ అడ్డంకులే..!

Haribabu bjp
Spread the love

వెంక‌య్య వార‌సుడికి కొత్త ఆశ‌లు పుట్టుకొచ్చాయి. మారిన రాజ‌కీయ ప‌రిణామాల్లో త‌న‌కు కొత్త యోగ్యం ద‌క్కుతుంద‌నే అభిప్రాయంతో సాగుతున్నారు. అమాత్య హోదా కోసం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు హ‌రిబాబు అర్రులు చాస్తున్నారు. త‌న‌కు అవ‌కాశం ఖాయ‌మ‌ని న‌మ్ముతున్నారు. ఇప్ప‌టికే విశాఖ‌లోని హ‌రిబాబు అనుచ‌రులంతా త‌మ నాయ‌కుడు మంత్రి అయిపోతున్నార‌ని ప్ర‌చారం ప్రారంభించేశారు. అయితే హ‌రిబాబుకి అవ‌కాశాల‌కు మించి అడ్డంకులు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోవాలంటే అనేక ఆటంకాలు అధిగమించాల్సి ఉంటుంది.

అందులో మొద‌టిది వెంక‌య్య వ‌ర్గం కావ‌డం. ప్ర‌స్తుతం మోడీ-షా ద్వ‌యానికి వెంక‌య్యే గిట్ట‌లేద‌ని ప్ర‌చారం. అందుకే ఆయ‌న్ని క‌ట్ట‌డి చేయ‌డానికి ఉప‌రాష్ట్ర‌ప‌తిని చేసేసి రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌నుంచి తొల‌గించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాంటిది ఆయ‌న స్థానంలో వెంక‌య్య అనుంగు శిష్యుడికి అవ‌కాశం అంత సులువు కాదు. ఇక రెండో విష‌యం చంద్ర‌బాబు. కంభంపాటి హ‌రిబాబుకి సామాజికంగా కూడా చంద్ర‌బాబుతో సాన్నిహిత్యం ఉంది. చంద్ర‌బాబు స‌ర్కారు మీద ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేద‌ని బీజేపీ శ్రేణులే భావిస్తున్నాయి. ప్ర‌స్తుతం బీజేపీ మీద చంద్ర‌బాబు దండెత్తుతుంటే మ‌ళ్లీ బాబుకి బాగా కావాల్సిన హ‌రిబాబుకి అవ‌కాశం అంటే అది మోడీ అంగీకరించే అవ‌కాశం ఉండ‌ద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

మ‌రో కీల‌కాంశం రామ్ మాధ‌వ్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ఛార్జ్ గా రావ‌డం. ఆయ‌న‌తో కూడా హ‌రిబాబుకి అంత స‌ఖ్య‌త లేదు. దానికి తోడు హ‌రిబాబుకి మంత్రి ప‌ద‌వి కేటాయిస్తే ఏపీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం కొత్త నేత‌ను చూసుకోవాల్సి ఉంటుంది. అదో పోటీగా త‌యార‌వుతుంది. ఇప్పుడున్న త‌రుణంలో కొత్త త‌ల‌నొప్పి అవుతుంది. కాబ‌ట్టి హ‌రిబాబుకి మ‌రో అడ్డంకి అన‌డంలో సందేహం లేదు. ఇక దూకుడుగా ఉండ‌ర‌ని, పార్టీ శ్రేణుల‌తో కూడా స‌ఖ్య‌త‌గా సాగ‌ర‌ని హ‌రిబాబుకి పేరు. అదీ ఓ స‌మ‌స్య అవుతుంది. ఇక జీవీఎల్ వంటి గ‌ట్టి పోటీదారుడు ఉండ‌డం కూడా హ‌రిబాబుకి అస‌లు స‌మ‌స్య కాబోతోంది. ఇలాంటి అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొని , చివ‌ర‌కు అమాత్య హోదా ద‌క్కించుకునే ద‌శ‌కు చేరిన‌ప్ప‌టికీ హ‌రిబాబుకి ఆ త‌ర్వాత రాష్ట్రంలో అస‌లు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. ఏమ‌యినా హ‌రిబాబు ఆశ‌లు పండించుకోవాల‌నే ప‌ట్టుద‌ల ప్ర‌ద‌ర్శిస్తున్న త‌రుణంలో క‌మ‌ల‌ద‌ళంలో ఈ ప‌రిణామాలు ఆస‌క్తిదాయ‌క‌మే


Related News

vizag-south-vasupalli-ganesh-kumar-tdp-140048322520-10-1489122042

అధ్య‌క్షుడు లంచం తీసుకున్నారంటున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు

Spread the loveటీడీపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కారు. అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. ఏకంగా పార్టీ కార్యాల‌యం ముందు నిర‌స‌న చేప‌ట్టారు.Read More

Haribabu bjp

హ‌రిబాబు ప‌ద‌వి అందుకే పోయింది…!

Spread the loveఎట్ట‌కేల‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మారుతున్నాడు. నాలుగేళ్లుగా అనేక ప్ర‌యత్నాలు చేసినా సాధ్యం కానిది అనూహ్యంగా జ‌రిగింది.Read More

 • జ‌గ‌నా? జ‌న‌సేనా? తేల్చులేక‌పోతున్నారు..!
 • డ్యాన్ల‌ర్ల‌తో క‌లిసి చిందేసిన ఏపీ మంత్రి
 • రెచ్చిపోయిన అయ్య‌న్న అనుచ‌రులు
 • టీడీపీ మంత్రుల‌ త‌గాదాతో అధికారుల‌కు తంటా..
 • విశాఖ‌లో వివాదం:టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి
 • తెలుగు త‌మ్ముళ్ల త‌న్నులాట‌
 • సిట్టింగుల‌కు షాకివ్వ‌బోతున్న బాబు
 • ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *