Main Menu

విశాఖ టీడీపీకి కొంచెం చేదు, కొంచెం తీపి

Spread the love

విశాఖ న‌గ‌రంలో వ్య‌వ‌హారాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ టీడీపీ నేత‌లపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు ఇప్పుడు అధికార టీడీపీ వైపు చూస్తున్నారు. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి గ‌ట్టి ప‌ట్టు ఉండ‌డ‌మే దానికి కార‌ణం. వైసీపీలోకి వెళ్లాల‌ని భావించిన‌ప్ప‌టికీ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే ఉద్దేశంతో చివ‌రకు విష్ణుకుమార్ రాజు సైకిల స‌వారీకి సిద్ధ‌మ‌య్యారు.

దాంతో ఇప్పుడు విశాఖ ఉత్త‌రం సీటు మీద కొండంత ఆశ‌తో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ప‌రిస్థితి ఏమిట‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని దాదాపుగా నిర్ణ‌యించుకున్న స‌బ్బం హ‌రిని సంతృప్తిప‌రిచేందుకు ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఎలాంటి ఆఫ‌ర్ ఇస్తార‌న్న‌ది ఇప్పుడు చర్చ‌నీయాంశం అవుతుంది. ఉత్త‌ర సీటు అయితే సునాయాసంగా విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌నే అబిప్రాయంతో ప‌లువురు టీడీపీ ఆశావాహుల‌కు అది హాట్ సీటుగా మారుతోంది. దాంతో స‌బ్బం హ‌రి, విష్ణుకుమార్ రాజుల‌లో చాన్స్ ఎవ‌రిక‌న్న‌ది చంద్ర‌బాబు తేల్చాల్సి ఉంది

ఇక విశాఖ అర్బ‌న్ టీడీపీ అధ్య‌క్షుడు అసంతృప్తిగా ఉన్నార‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ క‌ల‌యిక‌లో విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ కి కేటాయించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కి ఇక్క‌డ ప‌ట్టుంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న గుర్తించ ద‌గిన స్థాయిలో ఓట్లు సాధించారు. దాంతో విశాఖ జిల్లాలోనే కాంగ్రెస్ కోరుకునే ఏకైక సీటు ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం కాబోతోందనే స‌మాచారంతో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ ని సందిగ్దంలో ప‌డేస్తోంది. త‌న భ‌విష్య‌త్ మీద ఆయ‌న‌కు బెంగ ప‌ట్టుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

దాంతో అవ‌స‌ర‌మైతే తాను వైసీపీ నుంచి పోటీ చేస్తాన‌ని వాసుప‌ల్లి గ‌ణేష్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెప్పిన‌ట్టు సాగుతున్న ప్ర‌చారం ఇప్పుడు సంచ‌ల‌నం కాబోతోంది. త‌న‌కు సీటు కేటాయించ‌కుండా కాంగ్రెస్ కోటాలో పోతే, త‌న దారి త‌న‌దేన‌ని వాసుప‌ల్లి గ‌ణేష్ పేర్కొన‌డం విశాఖ టీడీపీలో ఉలికిపాటుకి గురిచేస్తోంది. మ‌త్స్య‌కార సామాజిక‌వ‌ర్గం నేత‌కు మొండిచేయి చూపితే అది కోస్తాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల మీద ప్ర‌భావం చూప‌వ‌చ్చ‌నే అంచ‌నాలో ఉన్నారు. ఈ ప‌రిణామాల‌తో టీడీపీకి ఉత్త‌ర‌, ద‌క్షిణాలు మింగుడుప‌డేలా క‌నిపించ‌డం లేదు.






Related News

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

Spread the loveఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనేRead More

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Spread the loveటాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *