Main Menu

విశాఖ మీద గురిపెట్టిన విజ‌య‌సాయిరెడ్డి

Spread the love

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దృష్టి మ‌ర‌ల్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న విశాఖ మీద కేంద్రీక‌రించారు. గ్రేట‌ర్ సిటీలో పాగా వేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌లే టీడీపీకి చెందిన కొంద‌రు సీనియ‌ర్ల‌తో ర‌హ‌స్యంగా స‌మావేశాలు నిర్వ‌హించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త్వ‌ర‌లో కండువాలు క‌ప్పే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈలోగా న‌గ‌రంలో విస్తృతంగా ప‌ర్య‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలని నిర్ణ‌యించుకున్నారు. ఓవైపు పార్టీ అధినేత పాద‌యాత్ర సాగుతుండ‌గా మ‌రోవైపు విశాఖ న‌గ‌రంలో స‌మ‌స్య‌ల‌పై యాత్ర‌కు విజ‌య‌సాయి రెడ్డి స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఈ యాత్ర సాగ‌బోతోంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 72 వార్డుల్లోనూ పాద‌యాత్ర నిర్వ‌హించ‌బోతున్నారు. 10 రోజుల పాటు 180 కిలోమీటర్ల మేర యాత్ర సాగించ‌బోతున్న‌ట్టు వైసీపీ ప్ర‌క‌టించింది.

వైసీపీ త‌రుపున గ‌డిచిన ఎన్నిక‌ల్లో విశాఖ‌లో కనీసం బోణీ కూడా కొట్ట‌లేక‌పోయారు. గ్రేట‌ర్ ప‌రిధిలోని 8 సీట్ల‌ను టీడీపీ, బీజేపీ కూట‌మి కైవ‌సం చేసుకుంది. అన‌కాప‌ల్లి నుంచి భీమిలి వ‌ర‌కూ అన్ని స్థానాలు ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా, ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజ‌య‌మ్మ‌ను బీజేపీ అభ్య‌ర్థి కంభంపాటి హ‌రిబాబు ఓడించారు. దాంతో విశాఖ న‌గ‌రంలో కేంద్రీక‌రించాల‌ని పార్టీ తీసుకున్న నిర్ణ‌యంలో భాగంగా విజ‌య‌సాయిరెడ్డి దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరు మీద వ్య‌తిరేక‌త పెరుగుతున్న నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి విశాఖ‌లో సాగించే యాత్ర ప్ర‌భావం ఎలా ఉంటుందో చూడాలి.






Related News

వివాదంలో అచ్చెన్న సోద‌రుడు

Spread the loveఅధికారుల వ్య‌వ‌హారాల్లో రాజ‌కీయాలు జోక్యం చేసుకోవ‌డం చాలాకాలంగా సాగుతున్న తంతు. కానీ ఇప్పుడు అధికారుల్లో రాజ‌కీయాల్లో భాగ‌స్వాములవుతున్నారు.Read More

బాబు చుట్టూ భోగాపురం రగడ

Spread the loveభోగాపురం ఎయిర్ పోర్ట్ వ్యవహారం చంద్రబాబు సర్కారు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్ట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *