Main Menu

చంద్ర‌బాబుకి షాక్

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి అనూహ్యంగా షాక్ త‌గిలింది. ఆయ‌న చేస్తున్న ప్ర‌చారంతో పోలిస్తే ఫ‌లితాలు నామ‌మాత్రంగా ఉన్నాయంటూ స్థానికులు నిల‌దీయ‌డం క‌ల‌క‌లం రేపింది. చివ‌ర‌కు సీఎం కాన్వాయ్ ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషంగా మారింది. టిట్లీ తుఫాను బాధితుల ఆగ్ర‌హం నేరుగా సీఎంని తాక‌డంతో ముఖ్య‌మంత్రి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయాల్సి వ‌చ్చింది.

తుఫాన్ కార‌ణంగా అతలాకుతలమైన తమను ప్రభుత్వం పట్టించుకోలేదని శ్రీకాకుళం జిల్లాలోని కవిటి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ను కవిటి గ్రామంలోని మత్స్యకారులు అడ్డుకున్నారు. తమ గ్రామం నుంచి వెళ్తూ తమ బాగోగులు పట్టించుకోకుండా వెళ్తున్న సీఎంపై తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌కి అడ్డుతగిలి తమ గోడును వెళ్లగక్కారు.

మూడు రోజులుగా తిండీ తిప్పలు లేకుండా అంధకారంలో గడిపామనీ, ప్రభుత్వం చెప్తున్నట్టుగా తమకు ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు. దీనిపై స్పందించిన చంద్రబాబు టిట్లీ బాధితుల సహాయార్ధం అన్ని సహాయక చర్యలు చేపట్టామనీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి అడ్డుతగలడం భావ్యం కాదని అన్నారు. కాగా, తుఫాను విధులకు సక్రమంగా హాజరు కాలేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో కవిటి ఎంపీడీవోని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దాంతో వ‌ర‌ద ప్రాంతాల్లో స‌హాయక చ‌ర్య‌లు నామ‌మాత్రంగా ఉన్నాయ‌నే వాద‌న‌కు ఈ ఘ‌ట‌న అద్దంప‌డుతోందని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.






Related News

దిగొచ్చిన సర్కారు, బోగాపురం ఎయిర్ పోర్ట్ కుదింపు

Spread the loveచంద్రబాబు సర్కారు దిగొచ్చింది. ఎట్టకేలకు లక్ష్యానికి చేరుతోంది. ఏకంగా పదిహేనువేల ఎకరాల్లో నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలికి చివరకుRead More

జ‌నసేన‌లోకి మ‌రో సీనియ‌ర్ నేత‌

Spread the loveకాంగ్రెస్ పార్టీలో ప‌లువురు సీనియ‌ర్లు సెల‌వు చెబుతున్నారు. సుదీర్ఘ‌కాలంగా న‌మ్ముకున్న పార్టీకి రాంరాం చెబుతున్నారు. ఇప్ప‌టికే వ‌ట్టిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *