Main Menu

వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్

Spread the love

మెగాస్టార్ చిరంజీవికి ట్రీట్మెంట్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా…అయితే ప్రస్తుతం 60వ పడిలో ఉన్న చిరు తన ఆరోగ్యం గురించి పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. రాజకీయంగా దూరం పాటిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ హీటు పుట్టిస్తున్నా చిరు మాత్రం పట్టనట్టే ఉన్నారు. మరో మూడు నెలల్లో రిటైర్ కాబోతున్న నేపథ్యంలో ఎంపీగా తన అవసరం పెద్దగా ఉండదని భావిస్తున్నారు. దాంతో పూర్తిగా పార్లమెంట్ కి ఢుమ్మా కొట్టేస్తున్నారు.

సినిమాల మీద కేంద్రీకరించిన చిరంజీవి భాగంగా నేచురోపతి వైద్యం కోసం వైజాగ్ వెళుతున్నట్టు తాజాగా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రం ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కొంత ఆలశ్యమయినప్పటికీ జోరు పెంచాలని యూనిట్ భావిస్తోంది.

అయితే ఈలోగానే ట్రీట్ మెంట్ కోసం త్వరలోనే చిరంజీవి వైజాగ్ వెళుతున్నారనే ప్రచారం ఆసక్తిగా మారింది.. నేచురోపతి ట్రీట్ మెంట్ కోసం ఆయన అక్కడకు వెళ్లబోతున్నారని చెబుతున్నారు. ఈ ట్రీట్ మెంట్ చేయించుకుంటే శరీరం మరింత చురుగ్గా కదలడానికి తగ్గట్టుగా ఉంటుందని అంటున్నారు. స్కిన్ కూడా రేడియేట్ అవుతుందని చెబుతున్నారు. దాంతో నేచురోపతి వైద్యానికి చిరంజీవి అంగీకరించినట్టు సమాచారం. ఎప్పుడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.






Related News

గంటాకి షాకిచ్చిన గవర్నర్

Spread the loveఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి షాకిచ్చారు.Read More

జ‌గ‌న్ మ‌న‌సులో ముప్పై ఏళ్ల ఆశ‌…

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బు మీద వ్యామోహం లేద‌నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *