Main Menu

సిట్టింగుల‌కు షాకివ్వ‌బోతున్న బాబు

Spread the love

ఏపీలో తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. అధినేత తీరు సిట్టింగుల‌ను స‌త‌మ‌తం చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రించిన చంద్ర‌బాబు అనూహ్య నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. వాస్త‌వానికి టీడీపీ గ‌డిచిన ఎన్నిక‌ల్లో 102 స్థానాల‌ను గెలుచుకుంది. కానీ చీరాల‌లో గెలిచిన న‌వోద‌య పార్టీ ఎమ్మెల్యేతో పాటు పిఠాపురం నుంచి విజ‌యం సాధించిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఆపార్టీ బ‌లం 104కి చేరింది. ఆ త‌ర్వాత 23 మంది ఫిరాయింపులు చేయ‌డంతో ప్ర‌స్తుతం టీడీపీ బ‌లం అసెంబ్లీలో 126 గా ఉంది. కానీ వారిలో అత్య‌ధికుల ప‌నితీరు ప‌ట్ల చంద్ర‌బాబు ఆగ్ర‌హంగా ఉన్నారు. ప్ర‌జ‌ల్లో ఎమ్మెల్యేల‌కు పెరుగుతున్న వ్య‌తిరేక‌త త‌న పుట్టి ముంచుతుంద‌నే అభిప్రాయంతో ఉన్నారు. ఈ కార‌ణంగా అనేక‌మందిని మార్చ‌డానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌నితీరు ఆధారంగా గ్రేడింగ్ లు ఇస్తూ, ర‌హ‌స్యంగా క‌వ‌ర్ల‌లో అనేక అంశాల‌ను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొస్తున్నారు. దాంతో ప‌లువురు నేత‌ల‌కు క‌ల‌వ‌రం త‌ప్ప‌డం లేదు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం ఐదారు చోట్ల‌కు మించి స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. దాంతో మెజార్టీ సీట్ల‌లో మార్పు ఖాయం అని అంటున్నారు. మంత్రుల్లోనే అఖిల‌ప్రియ‌కు వ‌చ్చేసారి ఎమ్మెల్యే సీటుకి బ‌దులుగా నంద్యాల ఎంపీ స్థానం కేటాయించే అవ‌కాశం క‌నిపిస్తోంది. మిగిలిన మంత్రుల‌కు ఆయా స్థానాలు ద‌క్క‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు. కానీ ఎమ్మెల్యేల్లో అనేక స‌మ‌స్య‌లున్నాయి. ఇప్ప‌టికే జ‌గ్గంపేట జ్యోతుల నెహ్రూకి ప్ర‌క‌టించారు. కానీ అదే జిల్లాకి చెందిన నెహ్రూ తోడ‌ల్లుడు ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే వ‌రుప‌ల సుబ్బారావుకి అవ‌కాశం ఉండ‌ద‌నే చెబుతున్నారు. రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రికి కూడా ఛాన్స్ ద‌క్క‌క‌పోవ‌చ్చు. పాడేరులో గిడ్డి ఈశ్వ‌రికి కూడా కొంత అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ అంత సులువుగా క‌నిపించ‌డం లేదు. కిడారు స‌ర్వేశ్వ‌ర‌రావుకి మాత్రం అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ మీద ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రంగా ఉండ‌డంతో బాబు పున‌రాలోచ‌న చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక పామ‌ర్రు ఉప్పులేటి క‌ల్ప‌న స్థానంలో వారి కుటుంబానికే చెందిన మ‌రొక‌రికి ఛాన్స్ ద‌క్క‌వ‌చ్చ‌ని అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. సంత‌నూత‌ల‌పాడు, కందుకూరు స్థానాల్లో కూడా మార్పు ఖాయంగా క‌నిపిస్తోంది. అద్దంకి విష‌యం అంత సులువు కాదు. క‌దిరి క‌ల‌హం చ‌ల్లార‌క‌పోవ‌డంతో మూడో నేత‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. దాంతో మొత్తంగా స‌గం మంది ఫిరాయింపుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లే అవ‌కాశం క‌నిపిస్తోంది.

వారితో పాటుగా టీడీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా క‌నీసం 30మందికి అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే అలాంటి వారి లిస్టును చంద్ర‌బాబు సూక్ష్మంగా ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ముందుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యామ్నాయ నాయ‌క‌త్వాన్ని ఎంచుక‌వోడం శ్రేయ‌స్క‌ర‌మ‌ని భావిస్తున్న బాబు వాటిమీద దృష్టి పెట్టిన‌ట్టు చెబుతున్నారు. ఈ జాబితాలో గోదావ‌రి జిల్లాలకు చెందిన ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లాలో కూడా క‌నీసం ముగ్గురికి అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. కొన్ని చోట్ల వార‌సుల‌కు, వారి కుటుంబాల‌కు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చిన‌ప్ప‌టికీ మ‌రికొన్ని స్థానాల్లో మాత్రం పూర్తిగా కొత్త వారితో రంగంలో దిగే ఆలోచ‌న‌లో టీడీపీ అధినేత ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే క‌నీసంగా 40మంది సిట్టింగులు అంటే మూడోవంతు నేత‌ల‌కు మొండిచేయి త‌ప్ప‌దు. ఈ అంచ‌నాతోనే అనేక‌మంది ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.


Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *