క‌ట‌క‌టాల్లో టీడీపీ నేత‌

tdp
Spread the love

విశాఖ భూకబ్జా కేసులు ప్ర‌కంప‌న‌లు చ‌ల్లార‌డం లేదు. ఇప్ప‌టికే టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌తో పాటు 11మంది కుటుంబ స‌భ్య‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఆయ‌న‌కు తోడుగా ఇప్పుడు మ‌రో నాయ‌కుడు జ‌త‌గ‌లిశారు. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను ఆక్ర‌మించిన కేసులో సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుడు కేసుల్లో ఇరుక్కున్నారు. ఆయ‌న్ని ఏకంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌ధానంగా భూక‌బ్జాల‌కు కేంద్రంగా ఉన్న మ‌ధురవాడ‌లో టీడీపీ ప్ర‌ధాన నేత‌ల్లో ఒక‌రిగా ఉన్న గొల్ల‌గాని స‌న్యాసిరావు ఇప్పుడు క‌ట‌క‌టాలు పాల‌య్యారు.

ప్రభుత్వ భూములలో ఉన్న బోర్డులను తొలగించి ఆక్రమణలకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను క‌బ్జా చేయ‌డం, రికార్డులు ట్యాంప‌రింగ్ కి పాల్ప‌డ‌డం వంటి అనేక నేరాలు జ‌రిగిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన కేసులో తాజా ప‌రిణామాలు దానికి అద్దంప‌డుతున్నాయి. స‌న్యాసిరావు స‌ర్కారు స్థ‌లాల‌ను ఆక్ర‌మించిన‌ట్టు నిర్థార‌ణ కాగా, పీలా గోవింద్ ట్యాంప‌రింగ్ కి పాల్ప‌డిన‌ట్టు తేలింది. దాంతో అటు అన‌కాప‌ల్లి నుంచి ఇటు భీమిలి వ‌ర‌కూ విశాఖ న‌గ‌రం అన్ని మూలలా ఆక్ర‌మ‌ణ‌ల ప‌రంప‌ర వెలుగులోకి వ‌స్తోంది. దాంతో ప‌లువురు ఆధికార పార్టీ పెద్ద‌లు అప్ర‌మ‌త్త‌మ‌యిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. త‌మ పేరు తెర‌మీద‌కు రాకుండా చూసుకోవ‌డానికి ప‌లువురు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

.






Related News

ysrcp tdp

విశాఖ సమరం షురూ..

Spread the loveఇప్పటికే రాయలసీమలో నంద్యాల, గోదావరి జిల్లాల్లో కాకినాడ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసులRead More

ganta babu

చంద్ర‌బాబుకి గంటా ఝ‌ల‌క్..!

Spread the loveఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మ‌రోసారి ఝ‌ల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాల‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. తాజాగాRead More

  • 2019 వ‌ర‌కూ టీడీపీతో..!
  • అయ్య‌న్న కూడా మారాల‌నుకుంటున్నారా?
  • వైసీపీకి మ‌రో అభ్య‌ర్థి ఖ‌రారు..!
  • హుద్ హుద్ నిధులు గాలిలో..చ‌ద‌వండి…!!!
  • రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే
  • చిచ్చు రాజేసిన గంటా
  • క‌ట‌క‌టాల్లో టీడీపీ నేత‌
  • పీలా కేసుతో ప‌క్క‌దారికేనా?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *