చంద్ర‌బాబు FB పేజీలో ర‌చ్చ ర‌చ్చ‌

tdp
Spread the love

ఏపీసీఎం చంద్ర‌బాబు యువ‌సేన పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్ బుక్ పేజ్ లో తెలుగు త‌మ్ముళ్లు నానా ర‌చ్చ చేశారు. చివ‌ర‌కు పోలీస్‌స్టేషన్ వ‌ర‌కూ సాగింది. నానా ర‌గ‌డ జ‌రిగింది. ఫేస్ బుక్ పోస్టుల విష‌యంలో కంచుప‌ల్లి అశోక్ అనే తెలుగు దేశం కార్య‌క‌ర్త‌ను అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పీఎస్ ముందు ఆందోళ‌న‌కు దారితీసింది. ఫేస్ బుక్ పేజీలో అస‌భ్య వ్యాఖ్య‌ల‌పై అశోక్ అలియాస్ ర‌మేష్ ని అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే చీపుర‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి కిమిడి మృణాళినికి స్థానిక టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య ఉన్న విబేధాలే ఈ వ్య‌వ‌హారానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.

జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు తో మృణాళిని వ‌ర్గానికి ఉన్న విబేధాలు తారా స్థాయికి చేరాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే చంద్రబాబు యువసేన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కంచుపల్లి అశోక్‌, మాజీ మంత్రి మృణాళిని వర్గానికి చెందిన బొత్స గోపీనాథ్‌, గవిడి శ్రీనివాసరావు తో బూతు భాగోతం మొద‌లెట్టారు. తిట్ల వ‌ర్షం కురిపించారు. దాంతో మృణాళిని ఆదేశాల‌తో పోలీసులు కేసు న‌మోదు చేశార‌న్న‌ది టీడీపీ స్థానిక నేత‌ల వాద‌న‌. అయిత ఎస్పీ ఆదేశాల‌తోనే అరెస్ట్ చేయాల్సి వ‌చ్చింద‌ని చీపురుప‌ల్లి పోలీసులు చెబుతున్నారు. త‌మ‌కు ఫిర్యాదులు లేవ‌ని, అయినా ఎస్పీ చెప్ప‌డంతోనే అరెస్ట్ చేయాల్సి వ‌చ్చింద‌ని స్థానిక పోలీసులు చెబుతుండ‌గా పోలీసుల తీరుపై అశోక్ మండిప‌డుతున్నారు. త‌న‌ను తీవ్రంగా హింసించార‌ని ఆరోపిస్తున్నారు.

దాంతో టీడీపీలో విబేధాల చివ‌ర‌కు సోష‌ల్ మీడియాకి చేరి, ఒక‌రిపై ఒక‌రు నోటికి ప‌ని చెప్ప‌డ‌మే కాకుండా, అధికారం స‌హాయంతో పోలీసుల‌తో వేధింపుల వ‌ర‌కూ వెళ్ల‌డం సాధార‌ణ టీడీపీ శ్రేణుల‌కు మింగుడుప‌డ‌డం లేదు. చీపురుప‌ల్లిలో తెలుగుదేశం ప‌రువు బ‌జారుకీడుస్తున్నార‌ని వాపోతున్నారు.


Related News

kothapalli geetha

ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ

Spread the loveవైసీపీ నుంచి గెలిచి, ఆ త‌ర్వాత టీడీపీ పంచ‌న చేరిన అర‌కు ఎంపీకి షోకాజ్ నోటీసు జారీRead More

ADARI KISHOR

హోదా అడిగినందుకు పార్టీలో వేటు!

Spread the loveఏపీలో ప్ర‌త్యేక హోదా హాట్ టాపిక్ అవుతోంది. హ‌స్తిన‌లో అవిశ్వాసం వ‌ర‌కూ వెళ్లింది. అంతేగాకుండా ఆఖరికి బీజేపీలోRead More

 • హ‌రిబాబుకి అన్నీ అడ్డంకులే..!
 • ప‌వ‌న్ అప‌హాస్యం కాకుండా చూసుకోవాలి…!
 • చంద్ర‌బాబు FB పేజీలో ర‌చ్చ ర‌చ్చ‌
 • అశోక్ గ‌జ‌ప‌తి మాట‌ల్లో అంత‌రార్ధం ఏమిటి?
 • వ‌ర్మ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు
 • బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
 • వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్
 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *