Main Menu

Latest Survey: శ్రీకాకుళంలో ఎవ‌రు ఎక్క‌డ?

Spread the love

ముక్కోణ‌పు పోరుగా మారిన ఏపీ రాజ‌కీయాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజేత ఎవ‌ర‌న్న‌దానిపై ఆస‌క్తి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో శ్రీకాకుళం జిల్లాలో తాజా ప‌రిస్థితిపై సేక‌రించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ 3 చోట్ల‌, టీడీపీ 7 చోట్ల విజ‌యం సాధించాయి. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. జ‌న‌సేన రాక‌తో రాజ‌కీయంగా ప‌లు మార్పులు జ‌రుగుతున్నాయి. గాజు గ్లాస్ భారీగా ఓట్లు ద‌క్కించుకోవ‌డం ఖాయంగా ఉంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన కార‌ణంగా ఫ‌లితాలు తారుమార‌య్యే ప‌రిస్థితి ఉంది.

2014లో టీడీపీ గెలిచిన ప‌లు చోట్ల ఇప్పుడు ప‌రాజ‌యం అంచులో ఆపార్టీ అభ్య‌ర్థులున్నారు. ఇక వైసీపీ గెలిచిన సిట్టింగ్ సీట్లు కూడా నిల‌బెట్టుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఇక ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం

టీడీపీ అభ్య‌ర్థులు టెక్క‌లి, రాజాం నియోజ‌క‌వ‌ర్గాల్లో ముంచంజ‌లో ఉన్నారు. అందులో రాజాం గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన సీటు కావ‌డం విశేషం. ఇక వైసీపీ అభ్య‌ర్థులు న‌రస‌న్న‌పేట‌, ఎచ్చెర్ల‌, పాత‌ప‌ట్నం, శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గాల్లో దూసుకుపోతున్నారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌లో గ‌ట్టి పోటీ క‌నిపిస్తోంది. ఆముదాల‌వ‌ల‌స‌, ఇచ్ఛాపురం, ప‌లాస‌, పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఇరు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ సాగుతోంది. ఇచ్ఛాపురం, ప‌లాస నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌దే కీల‌క పాత్ర కాబోతోంది.






Related News

గంటా గెలుస్తారా?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రాజేస్తున్న సీట్ల‌లో విశాఖ నార్త్ ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటులో ఎవ‌రుRead More

Latest Survey: విజ‌య‌న‌గ‌రం విజేత ఎవ‌రు?

Spread the loveఉత్త‌రాంధ్ర‌లో కీల‌క జిల్లా అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోనే అతి త‌క్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా విజ‌య‌న‌గ‌రం. ఈRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *