అయ్యో..సుజనా చౌదరి

Sujana
Spread the love

కేంద్రం మంత్రి సుజనా చౌదరికి షాక్ తగిలింది. విలేకర్ల ప్రశ్నలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు అర్థాంతరంగా ఆయన మీడియా సమావేశం నుంచి ఉడాయించాల్సి వచ్చింది. ఫ్లైట్ టైమ్ అయిపోయిందంంటూ పలాయనం చిత్తగించడం పట్ల పాత్రికేయులు పెదవి విరిచారు. నంద్యాలలో టీడీపీ వైఖరి మీద ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి చివరకు అనూహ్యంగా మీడియా సమావేశం నుంచి వెళ్లిపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన నంద్యాల ఉప ఎన్నికలు రెఫరెండం కాదని కూడా చెప్పేయడం విస్మయం కలిగించింది.

హొరాహోరాగా సాగుతున్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితం టిడిపి పాలనకు రిఫరెండం అంటూ జగన్ వ్యాఖ్యానిస్తున్నారు. మూడేళ్ల చంద్రబాబు ప్రభుత్వ విధానాల వైఫల్యాలపై ప్రజలు తీర్పు ఇవ్వాలని విజ్ణప్తి చేస్తున్నారు. కానీ కేంద్ర సహాయ మంత్రి వై సుజనాచౌదరి మాత్రం అందుకు నిరాకరించారు. నంద్యాల ప్రభుత్వ తీరుకు రిఫరెండం కాబోదని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత నంద్యాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన స్పందిస్తూ అధికార టిడిపి అక్రమాలకు పాల్పడిందంటూ వైకాపా అధినేత జగన్ చేస్తున్న ప్రచారం దొంగే దొంగ.. దొంగ అంటున్నట్టుందన్నారు. ఉపఎన్నికల్లో గెలుపు కోసం వైకాపా పలు అక్రమాలకు పాల్పడుతోందని, వీటిని టిడిపిపై నెడుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికలన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఒకేసారి అభివృద్ధి పేరిట నిధుల వరద పారిస్తోందన్న విమర్శలను సుజనా చౌదరి తిప్పికొట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రాధాన్యతను బట్టే నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. ఒకప్పుడు విశాఖకు కేటాయించిన నిధులు, ఇప్పుడు చోటుచేసుకున్న అభివృద్ధితో పోల్చిచూస్తే అర్ధం అవుతుందన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇలానే నిధులిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.


Related News

ayyanna

బీజేపీలో డూప్లికేట్ నాయకులున్నారంటున్న మంత్రి

Spread the loveఏపీ బీజేపీలో డూప్లికేట్ నాయకులున్నారంటూ ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బీజేపీ నాయకురాలు దగ్గుబాటిRead More

pushpa srivani

కులదేవత మీద ఆన..జగన్ అన్నతోనే

Spread the loveపార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి తెరమీదకు రావడంతో వైసీపీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ వేసిన ఎత్తుగడలతో కలకలంRead More

 • జనసేన భవితవ్యం చెప్పిన బీజేపీ ఎమ్మెల్సీ
 • అచ్చెన్నా..ఏమిటీ పని?
 • ఉత్తరాంధ్రలో వైసీపీకి మరో షాక్
 • రంగంలోకి మాజీ స్పీకర్ కూతురు
 • కొత్త రాష్ట్రపతి తొలి అడుగు ఉత్తరాంధ్రలో..
 • విశాఖలో అరెస్ట్ అయ్యే పెద్ద నేతలెవరు
 • రాజప్ప నియోజకవర్గంలో రాజీనామాలు
 • విద్యార్థిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *