Main Menu

బీసీ వర్సెస్ బీసీ

Spread the love

ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. అందులోనూ శ్రీకాకుళం వ్యవహారాలయితే మరింత చిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ జిల్లాలో బీసీ సామాజికవర్గాలదే హవా. రాజకీయంగానూ పెత్తనం చేస్తుంటారు. పదవులను పొందుతుంటారు. అందుకు తగ్గట్టుగానే చాలాకాలంగా ఇక్కడ బలహీనవర్గాల మధ్యే ఆధిపత్య పోరు సాగుతోంది.

ప్రస్తుతం జిల్లా జనాభాగా ఉన్న 20,38,231లో అత్యధికులు తూర్పుకాపు, పోలినాటి వెలమ, కళింగ కులాలకు చెందిన వారే. బలహీనవర్గాలకు చెందిన వారే అయినా ఈ జిల్లా నేతలు రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కూడా తమైద ముద్ర వేస్తున్నారు. గౌతు లచ్చన్న మొదలుకుని బొడ్డేపల్లి రాజగోపాలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావు, కూన రవికుమార్, గుండ అప్పలసూర్యనారాయణ…అంతా బిసీ నేతలే. దాంతో పార్టీలు వేరయిన పదవుల విషయంలో బీసీ వర్సెస్ బీసీ అన్నట్టుగా కనిపిస్తుంది.

ముఖ్యంగా జిల్లా ఓటర్లలో అత్యధిక శాతం కలిగిన కాపు సామాజికవర్గం, తర్వాత వెలమ సామాజిక వర్గం, కళింగ సామాజిక వర్గాలున్నాయి. వెలమ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో ముఖ్యులంతా మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావును బీజేపీలో చేరమని ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. తద్వారా టీడీపీ మద్ధతుతో శ్రీకాకుళం అసెంబ్లీ సీటు కేటాయించడానికి , గెలవడానికి ఆయనకు మార్గం సుగమం అవుతుందనే చర్చను తీసుకొస్తున్నారు. అదే జరిగితే కింజరాపు, గుండ వర్గాలు కూడా మద్ధతిస్తాయని , తద్వారా జిల్లాలో వైసీపీని ఊడ్చేయవచ్చనే అంచనా టీడీపీ బీసీ నేతల్లో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ధర్మాన బిజెపీలోకి చేరుతారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అటువంటిది ఏమీ లేదంటూ ధర్మాన ప్రసాదరావు కొట్టిపారేస్తున్నప్పటికీ, కళింగ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణగతొక్కేయాలన్న వెలమసామాజిక రాజకీయ ఉద్దండుల వ్యూహంగా ఉంది.

అదే సమయంలో కాపు సామాజికవర్గం జిల్లా ఓటర్లలో 18 శాతం ఉండగా, వెలమ సామాజికవర్గం ఓటర్లు 15.8 శాతం ఉన్నారు. వీరికంటే తగ్గువుగా 11.2 శాతం మంది కళింగ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కల చిక్కులన్నీ పన్కన పెడితే తూర్పు కాపుల హవాకు అడ్డుకట్ట వేసే రీతిలో కాళింగులకు చెక్ పెట్టడం ద్వారా వెలమల ప్రాభవం పెంచుకోవడం కోసం జరుగుతున్నఈ ప్రయత్నం జిల్లా కేంద్ర నియోజకవర్గం రాజీకయాలను మార్చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేయర్‌గా గుండ అప్పలసూర్యనారాయణకు మద్దతు పలికేందుకు కింజరాపు కుటుంబీకులు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ముందుకొచ్చింది. ఇక ఎమ్మెల్యేగా ధర్మానకు లైన్ క్లియర్ చేసేలా ఉన్న ఈ పరిణామాలు జిల్లాలో పలువురి బలాబలాల మీద ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా ఆముదాలవలసలో కూనరవికుమార్ కి ఈ పరిణామాలు సానుకూలంగా మారతాయని, తమ్మినేని సీతారంకి కొత్త సమస్యలు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో కాళింగ పెద్దలు సైతం ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయినా తూర్పు కాపులు, వెలమలు కలిసి సాగితే మాత్రం గడిచిన ఎన్నికల్లో మాదిరిగా కాళింగులకు పెద్దగా అవకాశాలు రాకపోవచ్చు. దాంతో చివరకు ఏం జరుగుతుందన్నది చర్చనీయాంశమే. మొత్తంగా బీసీల సమరం మాత్రం తప్పదనిపిస్తోంది.


Related News

దిగొచ్చిన సర్కారు, బోగాపురం ఎయిర్ పోర్ట్ కుదింపు

Spread the loveచంద్రబాబు సర్కారు దిగొచ్చింది. ఎట్టకేలకు లక్ష్యానికి చేరుతోంది. ఏకంగా పదిహేనువేల ఎకరాల్లో నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలికి చివరకుRead More

జ‌నసేన‌లోకి మ‌రో సీనియ‌ర్ నేత‌

Spread the loveకాంగ్రెస్ పార్టీలో ప‌లువురు సీనియ‌ర్లు సెల‌వు చెబుతున్నారు. సుదీర్ఘ‌కాలంగా న‌మ్ముకున్న పార్టీకి రాంరాం చెబుతున్నారు. ఇప్ప‌టికే వ‌ట్టిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *