వైసీపీకి మ‌రో అభ్య‌ర్థి ఖ‌రారు..!

shilpa brothers
Spread the love

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న వైసీపీ ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. సిట్టింగ్ ల‌తో పాటు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి చేరిన వారికి ఓకే చేసింది. 2014 ఎన్నిక‌ల అనుభ‌వాల నేప‌థ్యంలో ఈసారి బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను రంగంలో దింపుతోంది. అందులో భాగంగా కాంగ్రెస్ కుటుంబం నుంచి వ‌చ్చి చేరిన కాసు మ‌హేష్ రెడ్డి కి గుర‌జాల ఖాయం చేసిన జ‌గ‌న్ తాజాగా మ‌రో అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. నంద్యాల ఎన్నిక‌ల బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న 2018 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీ సీటు మైనార్టీల‌కే ఖాయం అని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా, శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిని ఎమ్మెల్యే చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌ద్వారా గ‌తంలో చ‌క్ర‌పాణిరెడ్డి ప్రాతినిధ్యం వ‌హించిన శ్రీశైలం సీటు దాదాపుగా ఆయ‌న‌కు ఖాయం అనే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం అక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న శేషారెడ్డిని ఎలా సంతృప్తి ప‌రుస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌.

అదే స‌మ‌యంలో బ‌న‌గాన‌ప‌ల్లి ఇన్ఛార్జ్ కాట‌సాని రామిరెడ్డి తాజాగా జ‌గ‌న్ బ‌హిరంగ‌స‌భ‌కు కూడా గైర్హాజ‌ర‌యిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న మ‌నుసు మార్చుకుని సైకిలెక్కితే ఆ సీటు కూడా శిల్పా చ‌క్ర‌పాణికి కేటాయించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. మొత్తంగా అభ్య‌ర్థి ఖాయంగా చెప్ప‌వ‌చ్చు. సీటు మాత్ర‌మే స్ప‌ష్ట‌త రావాలి. జ‌గ‌న్ ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డానికి కూడా కార‌ణం లేక‌పోలేదు. జ‌గ‌న్ మాట్లాడడానికి ముందు మాట్లాడిన శిల్పా చ‌క్ర‌పాణి గ‌తంలో త‌మ అనుభ‌వాన్ని జ‌గ‌న్ కి గుర్తు చేశారు. అప్ప‌ట్లో శిల్పా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రం వైసీపీలో వ‌స్తామంటే సీట్ల విష‌యంలో భూమాని, బుడ్డాని న‌మ్ముకున్నార‌ని, వాళ్లిద్ద‌రే ముంచేశార‌ని వ్యాఖ్యానించారు. అప్పుడే త‌న‌కు శ్రీశైలం, అన్న‌కు నంద్యాల కేటాయించి ఉంటే తామే వైసీపీలో ఉండేవార‌మ‌ని తేల్చి చెప్పేశారు. అయితే ఇప్పుడు ఆ వ్య‌వ‌హారంలో స్ప‌ష్ట‌త రావ‌డం విశేషం.

అదే స‌మ‌యంలో శిల్పా రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌రిగితే మ‌రోసారి గౌరు వెంక‌ట‌రెడ్డిని నిల‌బెట్టే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న శిల్పా చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు శిల్పా రాజీనామా చేసిన త‌ర్వాత ఆ సీటులో వైసీపీ అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి కాబ‌ట్టి వెంక‌ట‌రెడ్డిని నిల‌బెట్ట‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. దానిలో మాత్రం క్లారిటికి ఇంకా చాలా స‌మ‌యమే ఉంద‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు.


Related News

tdp

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Spread the loveతెలుగుదేశం నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే భూ కబ్జా కేసులోRead More

Sujana

అయ్యో..సుజనా చౌదరి

Spread the loveకేంద్రం మంత్రి సుజనా చౌదరికి షాక్ తగిలింది. విలేకర్ల ప్రశ్నలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు అర్థాంతరంగాRead More

 • విశాఖ సమరం షురూ..
 • చంద్ర‌బాబుకి గంటా ఝ‌ల‌క్..!
 • 2019 వ‌ర‌కూ టీడీపీతో..!
 • అయ్య‌న్న కూడా మారాల‌నుకుంటున్నారా?
 • వైసీపీకి మ‌రో అభ్య‌ర్థి ఖ‌రారు..!
 • హుద్ హుద్ నిధులు గాలిలో..చ‌ద‌వండి…!!!
 • రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే
 • చిచ్చు రాజేసిన గంటా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *