Main Menu

టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో కొత్త కులం!

Spread the love

ఆస‌క్తిక‌రంగా మారింది. చంద్ర‌బాబు స‌ర్కారు తీరు విస్మ‌యం క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ ఎమ్మెల్సీ శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు ఎస్టీ స‌ర్టిఫికెట్ ను కోర్ట్ కొట్టివేసింది. ఆయ‌న మేన‌ల్లుడు కూడా ఎస్టీ కాద‌ని తేల్చ‌డంతో వారి స‌ర్టిఫికెట్లు ర‌ద్ద‌య్యాయి. దాంతో ఆయ‌న జ‌న‌ర‌ల్ సీటు మీద దృష్టి పెట్టారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

అయితే తాజాగా ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల ఆదేశాల ప్ర‌కారం శత్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు సోద‌రి న‌ర‌సింహ‌ప్రియ‌కు ఎస్టీ స‌ర్టిఫికెట్ మంజూరుకావ‌డం విశేషంగా మారింది. ఆమె గ‌తంలో పార్వ‌తీపురం మునిసిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ గా కూడా ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో అన్న‌య్య ది ఒక కులం, చెల్లిది మ‌రో కులం ఎలా అంటూ ప‌లువురు గిరిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యం మీద న్యాయ‌పోరాటానికి కూడా ప‌లువురు సిద్ధ‌ప‌డుతుండ‌డం విశేషం.

గిరిజ‌న ప్రాంతంలో ఎస్టీల‌ను కాద‌ని, నాన్ ట్రైబ్స్ కి స‌ర్టిఫికెట్లు ఇచ్చి అన్నింటా బినామీల‌ను నింపేందుకు ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌హ‌క‌రించ‌డం అన్యాయ‌మ‌ని వాపోతున్నారు. నేరుగా ఎస్సీ, ఎస్టీ మంత్రి న‌క్కా ఆనంద్ బాబు తీరుని త‌ప్పుబ‌డుతున్న‌ట్టు సీనియ‌ర్ ఎస్టీ నేత‌లు చెబుతుండ‌డం విశేషం. దాంతో ఈ విష‌యం ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లా మ‌న్యం ప్రాంతంలో హాట్ టాపిక్ అవుతోంది.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత ఇక్క‌ట్లలో ప‌డ్డారు. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆమెకుRead More

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌లు పొందిన యువ‌నేత‌

Spread the loveజ‌న‌సేన అడుగులు కొత్త పంథాలో సాగుతున్నాయి. న‌వ త‌రాన్ని రాజ‌కీయంగా ఎదిగే దిశ‌లో ప్రోత్స‌హించేందుకు జ‌న‌సేనాని కీల‌కRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *