Main Menu

వైసీపీలో రాజీనామాల ప్ర‌కంప‌న‌లు

Spread the love

విపక్ష వైసీపీ వ్య‌వ‌హారాలు ర‌చ్చ‌కు దారితీస్తున్నాయి. వ‌రుస‌గా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఆపార్టీ వ్య‌వ‌హారాల్లో వేడి రాజుకుంటోంది. ఇప్ప‌టికే కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలో అశోక్ బాబు వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. తాజాగా పెద‌కూర‌పాడులో కోఆర్డినేట‌ర్ తొల‌గింపు త‌ల‌నొప్పిగా మారింది. ఆ త‌ర్వాత మండ‌పేట‌లో కూడా కోఆర్డినేట‌ర్ గా ప‌నిచేసిన వేగుళ్ల లీలా కృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా ఈ వ్య‌వ‌హారం విశాఖ వ‌ర‌కూ చేరింది. పార్టీ ఆవిర్భాం నుంచి వైసీపీలో ఉన్న మ‌హిళా నేత ప‌సుపులేటి ఉషా కిర‌ణ్ పార్టీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం త‌రుపున ఉషా కిర‌ణ్ పార్టీ ఆవిర్భావం నుంచి జ‌గ‌న్ వెంట ఉన్నారు. ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేటర్ గా కూడా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం పార్టీలో రాష్ట్ర క‌మిటీ కార్య‌ద‌ర్శిగా కూడా ఉన్నారు. అంతేగాకుండా వైసీఈప మ‌హిళా విభాగం విశాఖ జిల్లా అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతున్నారు.

తాజాగా వైసీపీలో వ‌రుస‌గా కోఆర్డినేట‌ర్ల మార్పిడి వ్య‌వ‌హారంతో కొంద‌రు నేత‌లు చేజారిపోరిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అవ‌కాశాలు వ‌చ్చే మార్గం క‌నిపించ‌క‌పోవ‌డంతో ప్ర‌త్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందులో భాగంగానే ఉషా కిర‌ణ్ కూడా జ‌న‌సేన వైపు చూస్తున్న‌ట్టు భావిస్తున్నారు. వ‌రుస‌గా సీనియ‌ర్ నేత‌లు కూడా చేజారిపోతుండ‌డంతో వైసీపీకి న‌ష్టం త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.






Related News

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

Spread the loveఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనేRead More

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Spread the loveటాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *