Main Menu

హ‌రిబాబు ప‌ద‌వి అందుకే పోయింది…!

Spread the love

ఎట్ట‌కేల‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మారుతున్నాడు. నాలుగేళ్లుగా అనేక ప్ర‌యత్నాలు చేసినా సాధ్యం కానిది అనూహ్యంగా జ‌రిగింది. ఇన్నాళ్లుగా ప‌ట్టు నిలుపుకున్న వెంక‌య్య నాయుడు ఈసారి చేతులెత్తేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. దాంతో విశాఖ ఎంపీ హ‌రిబాబు స్థానంలో కొత్త అధ్య‌క్షుడికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. క‌మ‌ల‌నాధుల‌కు కొత్త ద‌ళ‌ప‌తి ఖాయంగా మారింది.

అయితే హ‌ఠాత్తుగా హ‌రిబాబు ప‌ద‌వి కోల్పోవాల్సి రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఆయ‌న రాజీనామా చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న‌తో బ‌ల‌వంతంగా చేయించార‌నే వాద‌న ఉంది. అదే స‌మ‌యంలో ఆయ‌న ఏపీకి రైల్వేజోన్ ఇవ్వ‌లేద‌న్న కార‌ణంతో రాజీనామా చేసిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ వాస్త‌వం దానికి భిన్నంగా ఉంద‌ని హ‌స్తిన వ‌ర్గాల వాద‌న‌. అంతేగాకుండా హ‌రిబాబుని కేంద్ర‌మంత్రివ‌ర్గంలో తీసుకుంటార‌నే వాద‌న స‌త్య‌దూరం అని చెబుతున్నారు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు ఇటీవ‌ల మోడీ మీద నేరుగా దాడి చేస్తున్న త‌రుణంలో హ‌రిబాబు తీరుతో బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉంది. అనేక‌మార్లు చెప్పిన‌ప్ప‌టికీ నేరుగా ఏపీ సీఎం మీద విమ‌ర్శ‌లు చేయ‌లేని స్థితిలో హ‌రిబాబు ఉన్నార‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక కార‌ణాలు కావ‌చ్చు, ఇత‌ర ఆర్థిక వ్య‌వ‌హారాలుతోడు ఉండ‌వ‌చ్చు గానీ, హ‌రిబాబు మాత్రం తెలుగుదేశంతో ఢీ కొట్ట‌లేర‌న్న నిర్ణ‌యానికి మోడీ-షా బృందం వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీని బ‌ద్నాం చేస్తున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా ఎదురుదాడి చేయ‌లేని స్థితిలో రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు ఉండ‌డం స‌రికాద‌ని భావించిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో బ‌ల‌వంతంగానే కంభంపాటి వారిని సాగ‌నంపార‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం ప్ర‌చారం సాగిస్తోంది.

అదే స‌మ‌యంలో బీజేపీకి కాబోయే అధ్య‌క్షుడు ఖ‌చ్చితంగా కాపు సామాజిక‌వ‌ర్గం అని ఖ‌రారు చేస్తున్నారు. సోము వీర్రాజు, పైడికొండ‌ల మాణిక్యాల‌రావు, క‌న్నాలక్ష్మీనారాయ‌ణ‌, ఆకుల స‌త్య‌న్నారాయ‌ణ‌లో ఒక‌రు బీజేపీ ఏపీ క‌మిటీకి సార‌ధి కావ‌డం ఖాయంగా చెబుతున్నారు. దాంతో ఈ ప‌రిణామాలు ఆస‌క్తిగా మారుతున్నాయి.






Related News

వివాదంలో అచ్చెన్న సోద‌రుడు

Spread the loveఅధికారుల వ్య‌వ‌హారాల్లో రాజ‌కీయాలు జోక్యం చేసుకోవ‌డం చాలాకాలంగా సాగుతున్న తంతు. కానీ ఇప్పుడు అధికారుల్లో రాజ‌కీయాల్లో భాగ‌స్వాములవుతున్నారు.Read More

బాబు చుట్టూ భోగాపురం రగడ

Spread the loveభోగాపురం ఎయిర్ పోర్ట్ వ్యవహారం చంద్రబాబు సర్కారు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్ట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *