విశాఖ సమరం షురూ..

ysrcp tdp
Spread the love

ఇప్పటికే రాయలసీమలో నంద్యాల, గోదావరి జిల్లాల్లో కాకినాడ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు తెలుసుకునే అవకాశం కూడా వస్తోంది. మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. జీవీఎంసీ ఎన్నికలతో ఉత్తరాంధ్ర ప్రధాన నగరంలో ప్రజల నాడి పట్టుకునే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. తద్వారా ఏపీలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్న అంచనాకు రావచ్చని భావిస్తున్నారు.

విశాఖ ఎన్నికలను చాలాకాలంగా ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. గడిచిన సాధారణ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ ఎన్నికలు జరిగినప్పటికీ మిగిలిపోయిన అతి కొద్ది కార్పోరేషన్లలో విశాఖ ఒకటి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించడమే తప్ప ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. దాంతో జీవీఎంసీ ఎన్నికల కోసం ఎదురుచూసిన చాలామంది నిరుత్సాహంతో ఉన్నారు.

అలాంటి సమయంలోనే తాజాగా కార్పోరేషన్ డివిజన్ల ప్రక్రియ పూర్తిచేయడం విశేషంగా మారింది. మొత్తం విలీన గ్రామాలతో కలుపుకుని 81 డివిజన్లకు నగర విస్తీర్ణం పెరిగింది. ఇక రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. కాబట్టి ఎన్నికలకు ఒక అడుగు పడినట్టే భావిస్తున్నారు. దాంతో నగరంలో మరోసారి ఎన్నికల కోలాహలం ప్రారంభమవుతోందనే చెప్పవచ్చు. విశాఖలో అధికార కూటమి మధ్య సఖ్యత లేదు. టీడీపీ వ్యవహారాలు చూస్తున్న గంటా శ్రీనివాసరావు భూదందాల మీద బీజేపీ ఎల్పీ నాయకుడు విష్ణుకుమార్ రాజు పలు ఆరోపణలు చేశారు. చివరకు భూదందాల వ్యవహారం సిట్ వరకూ వెళ్లింది. అదే సమయంలో ఎంపీ హరిబాబు తీరు మీద నగర ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో పురందేశ్వరి వంటి వారు కొంతైనా విశాఖ అవసరాల గురించి ప్రయత్నించినప్పటికీ ప్రస్తుత ఎంపీ తీరు దానికి భిన్నంగా ఉందనే వాదన ఉంది. దాంతో బీజేీపికి గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు.

ఇక టీడీపీలో సఖ్యత కానరావడం లేదు. ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. హుద్ హుద్ నిధుల విషయంలో నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ మీద ప్రజల్లో తీవ్ర ఆరోపణలున్నాయి. తూర్పు ఎమ్మెల్యే మినహా మిగిలిన వారు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే అభిప్రాయం ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే మీద భూ దందా కేసు నమోదు కావడం గమనార్హం. భీమిలి ఈ భూదందాలకు కేంద్రంగా ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి ఈ ఎన్నికలు పరీక్షగా మారబోతున్నాయి.

ఇక వైసీపీకి నగరంలో తగిన నాయకత్వం లేదు. గడిచిన ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ పార్టీ పెద్దగా పుంజుకున్న దాఖలాలు లేవు. గుడివాడ అమర్ నాథ్ ప్రయత్నాలతో రైల్వేజోన్ ఉద్యమం, భూదందాల మీద పోరాటం చేయడం కొంత ఊపు తీసుకొచ్చింది. కానీ కీలక నేతల్లో కదలిక కనిపించడం లేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి తగిన ప్రయత్నాలు జరగడం లేదు. దాంతో వైసీపీ అవకాశాలను చేజార్చుకుంటుందన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ,టీడీపీ అనుబంధం ఎలా సాగుతుంది, వైసీపీ ఏమేరకు సానుకూలతను సొమ్ము చేసుకుంటుందన్న దానిని బట్టి జీవీఎంసీలో ఫలితాలు ఉంటాయి.


Related News

vishnu kumar raju

బీజేపీ ఎల్పీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

Spread the loveటీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. తాజాగా మరోసారి మాటల యుద్ధం ముదురుతున్న విషయం స్పష్టమయ్యింది. ఈసారిRead More

chiru saira

వైజాగ్ లో చిరంజీవికి ట్రీట్ మెంట్

Spread the loveమెగాస్టార్ చిరంజీవికి ట్రీట్మెంట్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా…అయితే ప్రస్తుతం 60వ పడిలో ఉన్న చిరు తన ఆరోగ్యంRead More

 • బడ్జెట్ పై బాబుకి భిన్నంగా బ్రాహ్మణి
 • సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్
 • కొణతాల మళ్లీ తెరమీదకు…
 • వైసీపీలో మాజీ ఎమ్మెల్యే
 • పురందేశ్వరి ఫైర్
 • కాలువలో చంద్రన్న కానుకలు
 • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
 • ఒంటరయిపోయిన గంటా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *