Main Menu

పురందేశ్వరి ఫైర్

Spread the love

టీడీపీ తీరుపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. తమ పార్టీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. మిత్రపక్షం తీరు మింగుడుపడడం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ పొత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించి కలకలం రేపారు.

శ్రీకాకుళంలో జరిగిన బూత్ కమిటీ మహా సమ్మేళనం లో ఆమె పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందని, ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ఇందుకు జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ ప్రతి నెల ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పంపిణీలో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, కేంద్రం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం హైజాక్ చేసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయమై జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లడమే మా బాధ్యత అని అన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా 175 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దింపుతామని స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ ఒడిశావాసుల అభ్యర్థనతో సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. లేకుంటే ఇప్పటికే మంజూరు అయ్యేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.






Related News

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

Spread the loveఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనేRead More

బాల‌య్య, ప‌వ‌న్ పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Spread the loveటాలీవుడ్ హీరోల్లో సంపాద‌న‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కేఏRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *