Main Menu

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌లు పొందిన యువ‌నేత‌

Spread the love

జ‌న‌సేన అడుగులు కొత్త పంథాలో సాగుతున్నాయి. న‌వ త‌రాన్ని రాజ‌కీయంగా ఎదిగే దిశ‌లో ప్రోత్స‌హించేందుకు జ‌న‌సేనాని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రెసిడెంట్ లీడ‌ర్ షిప్ కార్య‌క్ర‌మం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌న్వీన‌ర్ గా జోగినాయుడిని నియ‌మించిన‌ట్టు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. విశాఖ జిల్లాలోని మారుమూల గ్రామంలో వెనుక‌బ‌డిన సామాజిక‌వ‌ర్గంలో జ‌న్మించి, ఉన్న‌త చ‌దువుల‌తో విదేశాల‌లో సైతం రాణించిన జోగినాయుడి నియామ‌కం ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌న‌సేన‌లో యువ‌కెరటాల‌ను నాయ‌క‌త్వ స్థానాల్లోకి ప్రోత్స‌హిస్తూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అభినంద‌నిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్రెసిడెంట్ లీడ‌ర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం సంద‌ర్భంగా క‌న్వీన‌ర్ తో పాటు మ‌రో ఐదుగురు కోఆర్డినేట‌ర్లను కూడా ప‌వ‌న్ నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ విదేశాల‌లో ఉన్న యువ‌త సైతం తెలుగు గ‌డ్డ కోసం ఏద‌యినా చేయాల‌ని భావిస్తే ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. దేశానికి యువ నాయ‌క‌త్వం అవ‌స‌రం అని అబిప్రాయ‌ప‌డ్డారు. అన్ని రంగాల‌లోనూ తాము యువ‌త‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌న్నారు. విధానాల రూప‌క‌ల్ప‌న‌లోనూ, సామాజిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలోనూ యువ‌త భాగ‌స్వామ్యం పెంచే ప్ర‌య‌త్నం అవ‌స‌రం అన్నారు. జోగినాయుడు త‌నకు యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌లో అనేక‌సార్లు ప‌రిచ‌య‌మ‌య్యార‌ని తెలిపారు. న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గానికి ఏదో చేయాల‌నే త‌ప‌న ఉన్న యువ నేత‌గా అభినందించార‌న్నారు. డైన‌మిక్ యువ నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా వివిధ సామాజిక‌వ‌ర్గాలు, వివిధ ప్రాంతాల‌కు చెందిన వారిని ఈ ప్రెసిడెంట్ లీడ‌ర్ షిప్ కార్య‌క్ర‌మంలో నియ‌మించామ‌న్నారు. మ‌రింత మంది యువ‌త భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు

ఈ కార్య‌క్ర‌మంలో క‌న్వీన‌ర్ గా నియ‌మితుడైన జోగినాయుడిని ప‌లువురు అభినందించారు. యూర‌ప్ లో స్థిర‌మైన జీవితం ఉన్న‌ప్ప‌టికీ పుట్టిన గ‌డ్డ మీద ప్రేమ‌తో ప్ర‌జా సంక్షేమం కోసం ముందుకు వ‌చ్చిన యువ‌త‌కు జోగినాయుడు ఆద‌ర్శ‌నీయుడిగా నిలుస్తార‌ని ప్ర‌శంసించారు.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *