Main Menu

గంటాకి చేదు అనుభ‌వం

Spread the love

ఏపీలో పాల‌క‌పార్టీకి చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో కాకినాడ‌లో ఏకంగా సీఎంకి షాక్ త‌గ‌ల‌గా, ఇప్పుడు తాజాగా విశాఖలో మంత్రి గంటాకు చేదు అనుభవం ఎదురైంది. మధురవాడ సాయిరాం కాలనీలోని జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆయనకు స్థానిక సమస్యలపై నిరసన జ్వాల ఎగసిపడింది. స్థానిక సమస్యలపై ప్రశ్నలవర్షం కురవడంతో అక్కడినుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డ మంత్రి గంటాను స్థానికులు, ప్ర‌తిప‌క్ష‌ నాయకులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌కు అడ్డు తగిలారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంచేశారు. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.






Related News

గంటాకి షాకిచ్చిన గవర్నర్

Spread the loveఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకి షాకిచ్చారు.Read More

జ‌గ‌న్ మ‌న‌సులో ముప్పై ఏళ్ల ఆశ‌…

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు డ‌బ్బు మీద వ్యామోహం లేద‌నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *