కాలువలో చంద్రన్న కానుకలు

1514978953.23
Spread the love

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే పథకాల డొల్లతనం ప్రజలను నిరాశపరుస్తోంది. ఎంతో ఆశించిన వారికి తీవ్ర నిరాశ కలిగించేలా ప్రభుత్వ వ్యవహారం ఉందని పేదలు వాపోతున్నారు. అందులో భాగంగానే చంద్రన్న కానుకల పేరుతో పంపిణీ చేసిన సరుకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపమే కాకుండా కనీసం వాటిని వినియోగించుకోవడానికే అవకాశం లేని పరిస్థితి ఉందని వాపోతున్నారు.

అందులో భాగంగానే విజయనగరం జిల్లా బొబ్బిలి వాసులు తమకు రేషన్ దుకాణంలో ఇచ్చిన చంద్రన్న కానుకల సరుకులను కాలువలో పడేసి నిరసన తెలిపారు. తాము తినడానికి కూడా పనికిరాని రీతిలో ఉన్న వాటిని ఎలా వాడుకోవాలని మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వం తమను అవమానించే రీతిలో ఇలాంటి వస్తువులు ఇవ్వడం అన్యాయమని వాపోయారు. ఇలా ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో ఇచ్చిన సరుకులను కాలువల్లో పడేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా అవి హెరిటేజ్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. బెల్లం మాత్రం గుజరాత్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు సమాచారం.






Related News

ysrcp_1829

వైసీపీలో మాజీ ఎమ్మెల్యే

Spread the loveఅరకు సహజంగా చల్లని ప్రాంతం. అందులోనూ శీతాకాలంలో అయితే మరింత చల్లగా ఉంటుంది. కానీ ఇప్పుడు అరకుRead More

purandeshwari

పురందేశ్వరి ఫైర్

Spread the loveటీడీపీ తీరుపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. తమ పార్టీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. మిత్రపక్షంRead More

  • కాలువలో చంద్రన్న కానుకలు
  • గవర్నర్ పై ఢిల్లీకి వెళతా..
  • ఒంటరయిపోయిన గంటా
  • విరుచుకుపడిన విజయసాయిరెడ్డి
  • డెంగీ బారిన ఎంపీ
  • అనితకు ఎసరు పెడుతున్న ఆయన..!
  • గంటాను ఢీ కొట్టిన అచ్చెన్న
  • గంటాను తాకిన అందాల సెగ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *