Main Menu

ప‌వ‌న్ అప‌హాస్యం కాకుండా చూసుకోవాలి…!

Spread the love

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన అధినేత‌గా ప‌రిణితి ప్ర‌ద‌ర్శించాల్సి ఉంది. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్లో జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. లేకుంటే ఆయ‌న‌తో పాటు పార్టీ కూడా ప‌రిహాసం పాల‌వుతుంది. ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో ఇది స్ప‌ష్టం అయ్యింది. దానికి కార‌ణం కూడా గ‌తంలో మాదిరి కాకుండా ఇప్పుడు సోష‌ల్ మీడియా స‌హాయంతో అనేక విష‌యాల‌ను త‌వ్వితీసి జ‌నం ముందు పెడుతున్నారు. దాంతో మాట మార్చే నాయ‌కుల‌కు చాలా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, ఫాతిమా కాలేజీ విద్యార్థుల విష‌యంలో కూడా ప్ర‌తిప‌క్షంలో ఉండి కూడా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని, వారం రోజుల్లో స‌మ‌స్య‌ను తీర్చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ , ఆత‌ర్వాత తాను అధికారంలో లేను క‌దా అంటూ మాట మార్చేసిన వైనం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇక తాజాగా తెలంగాణా విష‌యంలోనూ ఆయ‌న తీరు దానికి త‌గ్గ‌ట్టుగా ఉంది. తెలంగాణా విష‌యంలో 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న అనేక ప్ర‌క‌ట‌న‌లు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా తాను ఏకంగా 11 రోజులు ఆహారం తీసుకోలేద‌ని కూడా చెప్పేశారు. తెలంగాణ రావటానికి కారణం బలిదానం చేసిన అమ‌ర‌వీరుల త్యాగం అంటూ పేర్కొన్నారు. కానీ తీరా ఇప్పుడు దానికి భిన్నంగా కేసీఆర్ ని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌నే అప‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకుంటున్నారు. తెలంగాణ విష‌యంలో ర‌క్తం బొట్టు చింద‌కుండా రాష్ట్రాన్ని సాధించిన ఘ‌నుడిగా కేసీఆర్ ని ఆయ‌న కొనియాడారు. గ‌తంలో అమ‌ర‌వీరుల గురించి మాట్లాడి, ఇప్పుడు కేసీఆర్ ని పొగ‌డ‌డం ప‌వ‌న్ రెండు నాలుక‌ల ధోర‌ణికి నిద‌ర్శ‌నంగా ఉంద‌ని ఆయ‌న వ్య‌తిరేకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప్ర‌క‌ట‌నల విష‌యంలో కొంత స్ప‌ష్టంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ఫిష‌ర్ మెన్ కి ఎస్టీ హోదా విష‌యంలో కూడా అలాంటి తొంద‌ర‌పాటుతో జ‌న‌సేన ప‌రువు పోయింది. శ్రీకాకుళంలో ప‌ర్య‌ట‌న‌కు కూడా సిద్ధ‌ప‌డి ఆఖ‌రి నిమిషంలో వెన‌కుడుగు వేయ‌డంతో అటు ఎస్టీలు, ఇటు మ‌త్స్య‌కారులు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని త‌ప్పుబ‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కూడా అదే తంతు. తాను రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకం అని ఒక‌సారి, కాపుల‌కు విందు భోజ‌నం పెడ‌తాన‌ని చెప్పి ఇలా 5శాతం ఇచ్చి స‌రిపెడ‌తారా అంటూ మ‌రోసారి మాట్లాడి విస్మ‌యం క‌లిగించారు. మొత్తంగా ప‌వ‌న్ వ్య‌వ‌హారం విమ‌ర్శ‌ల‌కుల‌కు అవ‌కాశం ఇచ్చేలా క‌నిపిస్తోంది. పెద్ద అవ‌కాశవాదిని త‌ల‌పిస్తోంద‌నే ఆరోప‌ణ‌ల‌కు ఆస్కారం క‌లిగిస్తోంది. స‌రిదిద్దుకోక‌పోతే జ‌నం పెద్ద‌గా ఖాత‌రు చేసే అవ‌కాశం ఉండ‌దు. గ‌మ‌నించుకోవాలి.


Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *