Main Menu

గంటా కొట్టేసిన ప‌వ‌న్

Spread the love

జ‌న‌సేనాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వేశారు. ఏపీ అమాత్యుడి మీద ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. వాస్త‌వానికి చాలాకాలంగా గంటా శ్రీనివాస‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సుర‌క్షిత స్థానాల వైపు చూస్తున్నారు. అందులో భాగంగా పార్టీ మారే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌య‌త్నాలు చేసినా వైసీపీ త‌లుపులు మూసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపించాయి. ఇక తాజాగా జ‌న‌సేన విష‌యంలో కూడా గంటాకు చేదు అనుభ‌వం త‌ప్ప‌డం లేదు.

ముఖ్యంగా జ‌న‌సేన అధినేత‌కు గంటా మీద ఏమాత్రం విశ్వాసం లేద‌ని తాజా వ్యాఖ్య‌లు చాటుతున్నాయి. ఆయ‌న జంపింగ్స్ విష‌యంలో ఎప్పుడైనా జెండా మార్చే ఛాన్స్ ఉంద‌నే రీతిలో ప‌వ‌న్ చేసిన కామెంట్స్ ఇప్పుడు గంటా ప‌రిస్థితికి అద్దంప‌డుతున్నాయి. ‘ గంటా శ్రీనివాసరావును జనసేన పార్టీలోకి ఆహ్వానించేది లేదు. ఆయనపై నాకు కోపం లేదు. అతని ఆలోచన ధోరణి జనసేనకు సరిపడదు. గంటా లాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి ఎగిరిపోతారు. అలాంటి పక్షులను నమ్మను’’ అని జనసేనాని పవన్‌ అన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యకర్తల స‌మావేశంలో ప‌వ‌న్ చేసిన ఈ కామెంట్స్ రాజ‌కీయంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the love90Sharesరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the love9Sharesఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *