Main Menu

ఎంపీపీని ఎంపీ చేయాలనుకుంటున్న జగన్

Spread the love

జగన్ రూటు మార్చారు. వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సహాయంతో కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం ఎంపీ సీటు విషయంలో వైసీపీ అధినేత అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటుకి పోటీ చేసిన రెడ్డి శాంతి ప్రస్తుతం అసెంబ్లీ బరిలో దిగే అవకాశాలున్నాయని సమాచారం. ఆమె అసెంబ్లీ వైపు మొగ్గు చూపితే ప్రత్యామ్నాయంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని వైసీపీ వ్యూహం రచిస్తోంది.

గడిచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 1, 27,094 ఓట్లు తేడాతో కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పట్లో ఒక్క శ్రీకాకుళం అసెంబ్లీ సిగ్మెంటు నుంచే 34,974 ఓట్లు ఎం.పి. అభ్యర్థికి అప్పట్లో మోజార్టీ ఇచ్చింది. తర్వాత స్థానాల్లో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం నిలిచాయి. దాంతో ఈసారి సీనియర్లను బరిలో దింపి రామ్మోహన్ నాయుడికి అడ్డుకట్ట వేయాలని జగన్ ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగా పరిశీలనలో ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి ఎం.పి.పి. కిల్లి వెంకటగోపాల సత్యన్నారాయణ పేరు పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వద్దకు చర్చకు వెళ్ళినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే, విశాఖపట్నంలో సూర్య ఆసుపత్రి వాటాదారుడు, డాక్టర్ జి.శాంతారాం పేరును కూడా వైసీపీ అధిష్టానం పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరిని శ్రీకాకుళం నుంచి ఎంపీ సీటులో బరిలో దింపే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

అయితే కొత్తగా వచ్చిన నేతలను, ఎంపీ సీటుకి బరిలో దింపడం ద్వారా గడిచిన ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న జగన్ ఈసారి కూడా అలాంటి ప్రయోగాలకే సిద్ధపడతారా అన్నది సందేహమే. అందుకే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లు పరిశీలన వరకూ మాత్రమేనని, ఆఖరి నిమిషంలో అనూహ్య నిర్ణయాలుంటాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.






Related News

వివాదంలో అచ్చెన్న సోద‌రుడు

Spread the loveఅధికారుల వ్య‌వ‌హారాల్లో రాజ‌కీయాలు జోక్యం చేసుకోవ‌డం చాలాకాలంగా సాగుతున్న తంతు. కానీ ఇప్పుడు అధికారుల్లో రాజ‌కీయాల్లో భాగ‌స్వాములవుతున్నారు.Read More

బాబు చుట్టూ భోగాపురం రగడ

Spread the loveభోగాపురం ఎయిర్ పోర్ట్ వ్యవహారం చంద్రబాబు సర్కారు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్ట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *