Main Menu

సీఎం బొమ్మ కాల్చినందుకు టీడీపీ ఎమ్మెల్యేకి వారెంట్

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం కేసులో ఎమ్మెల్యే ఇక్కట్లలో పడ్డారు. ఆయనకు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఈ వ్యవహారం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కు తాజాగా కోర్ట్ ఎన్బీడబ్ల్యూ విడుదల చేయడం విశేషంగా మారింది.

ఆయన వాస్తవానికి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఏడాదిన్నర క్రితం పసుపు కండువా కప్పుకుని టీడీపీ గూటిలోకి మారారు. అయినా 2015 నాటి కేసు ఆయన్ని వెంటాడుతోంది. అప్పట్లో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పాల్గొన్న ఆందోళనలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడంపై కేసు నమోదయ్యింది. కానీ కోర్ట్ కి హాజరుకాకపోవడంతో సీరియస్ అయిన న్యాయమూర్తి నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ చేశారు.

వైసీపీని వీడినా, చంద్రబాబు గూటిలో చేరినా, సీఎంకి వ్యతిరేకంగా సాగించిన ఆందోళనల కేసు మాత్రం ఎమ్మెల్యేని వెంటాడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పాతపట్నం వాసులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే పై టీడీపీ అధినేత బొమ్మను కాల్చినందుకు పెట్టిన కేసులో వారెంట్ రావడం విశేషంగానే చెప్పవచ్చు.






Related News

టీడీపీ ఎమ్మెల్యేకి కోర్ట్ స‌మ‌న్లు

Spread the loveటీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత ఇక్క‌ట్లలో ప‌డ్డారు. కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆమెకుRead More

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శంస‌లు పొందిన యువ‌నేత‌

Spread the loveజ‌న‌సేన అడుగులు కొత్త పంథాలో సాగుతున్నాయి. న‌వ త‌రాన్ని రాజ‌కీయంగా ఎదిగే దిశ‌లో ప్రోత్స‌హించేందుకు జ‌న‌సేనాని కీల‌కRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *