Main Menu

టీడీపీలోకి ధ‌ర్మాన కుటుంబీకులు

Spread the love

వైసీపీ కీల‌క నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కుటుంబీకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్వ‌యంగా వియ్య‌పురాలు సైకిలెక్కేసింది. ఇదిప్పుడు న‌ర్సీప‌ట్నం రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. నర్సిపట్నం మాజీ శాసనసభ్యురాలు బోలెం ముత్యాలపాప, ఆమె భర్త పెదబాబు లు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. న‌ర్సీప‌ట్నం నియొజ‌క‌వ‌ర్గంలో వైసిపికి పెద్ద దిక్కుగా ఉన్న ఆమె శుక్ర‌వారం సాయంత్రం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఆధ్వ‌ర్యంలో బాబు కలసిన ముత్యాలపాప , పెదబాబు లను సీఎంకు పరిచయం త‌దుప‌రి పార్టీలో ముందు చేరి అయ్య‌న్న‌ని గెలిపించ‌డంతో పాటు భారీ మెజార్టీ తీసుకురావాల‌ని సూచించారు. అనంత‌రం ముత్యాలపాప , పెదబాబులకు పసుపు కండువా కప్పి ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా ముత్యాలపాప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు విప‌క్ష నేత అడ్గు త‌గులుతున్నార‌ని, ఈ విష‌యంలో ఆయ‌న‌తో ప‌దే ప‌దే విభేదించినందుకే త‌మ‌కు పార్టీలో అన్యాయం చేసినందునే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం త‌న‌తో పాటు వందమందికిపైగా కార్యకర్తలు సైతం తెదేపాలో చేరార‌ని, ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న అనుచ‌ర‌గ‌ణ‌మంతా టిడిపిలోకి వ‌స్తుంద‌ని, అంతా అయ్య‌న్న విజ‌యానికి కృషి చేస్తామ‌ని స్ప‌ష్టంచేసారామె






Related News

గంటా గెలుస్తారా?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రాజేస్తున్న సీట్ల‌లో విశాఖ నార్త్ ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో ఈ సీటులో ఎవ‌రుRead More

Latest Survey: విజ‌య‌న‌గ‌రం విజేత ఎవ‌రు?

Spread the loveఉత్త‌రాంధ్ర‌లో కీల‌క జిల్లా అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోనే అతి త‌క్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా విజ‌య‌న‌గ‌రం. ఈRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *