Main Menu

లోకేశ్ తోడల్లుడు త‌యార్..!

Spread the love

విశాఖ రాజ‌కీయాల్లో కొత్త మొఖాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అందులో భాగంగా ఏపీ టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తోడ‌ల్లుడు సిద్ధ‌మ‌వుతున్నారు. త‌న తాత ఎంవీఎస్ మూర్తి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అందుకోవడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేసేందుకు ఉత్సుక‌త చూపుతున్నారు.

ఇప్ప‌టికే చంద్ర‌బాబుని క‌లిసి త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు. నారా లోకేశ్ మ‌ద్ధ‌తు కూడా ఉండ‌డంతో దాదాపుగా ఆయ‌న‌కు విశాఖ బెర్త్ క‌న్ఫ‌ర్మ కావ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌ పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టిడిపి వర్గాల్లో ఈ విషయం ఆస‌క్తిని రేపుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలపై చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కూడా పలువురు నాయకులు ఈ విషయంపైనే చర్చిస్తుండటం కనిపించింది. భరత్‌కు టిక్కెట్‌ కేటాయింపు విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందని, ఆయనకు టిక్కెట్‌ దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు.

మరోవైపు రాష్ట్ర మంత్రి లోకేశ్‌ ఉత్తరాంధ్ర నుండే బరిలోకి దిగుతారని సమాచారం. ‘లోకేశ్‌ ఎక్కడి నుండి పోటీచేస్తే బావుం టుంది?’ అని బాబు ఉత్తరాంధ్ర నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. భీమిలీ సీటును ఆయన కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండగా,దానిపై ఇప్పటికే పీట ముడి నెలకొంది.దీంతో లోకేశ్‌ విశాఖ ఉత్తరం నుండి పోటీచేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే ఒకే జిల్లాలో ఒకే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. విశాఖ బరినుంచి భరత్‌ పక్కకు తప్పుకుంటే గాజువాకకు చెందిన పల్లా శ్రీనును అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.






Related News

మంత్రి గంటాపై జ‌గ‌న్ అస్త్రం ఆయ‌నే..!?

Spread the loveరాజ‌కీయ కుటుంబం నుంచి రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.Read More

చంద్ర‌బాబుకి గ‌ట్టి షాకిచ్చిన మాజీ మంత్రి

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌లు అనూహ్య మార్పులు జ‌రుగుతున్నాయి. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *